అబద్దాల ప్రచారంలో జగన్ గోబెల్స్‌ను మించిపోయారు

155

అబద్దాల ప్రచారంలో జగన్ గోబెల్స్‌ను మించిపోయారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు ఇచ్చిన వైఎస్సార్ పెళ్లి కానుక ఏమైందని ప్రశ్నించారు. మేనిఫెస్టో మాటల్లో భగవద్గీత, ఖురాన్, బైబిల్.. చేతల్లో మాత్రం చిత్తు కాగితమని మండిపడ్డారు.‘‘ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తాం, పంట వేసే సమయానికి మే నెలలో రూ.12,500 చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీప్రస్తుతం ఇస్తున్నది ఏడాదికి రూ.7,500 చొప్పున ఐదేళ్లకు రూ.37,500, కోత కోసింది రూ.12,500, దీనిని ఏమంటారు సీఎంగారు..?’’అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన ద్వారా చేస్తామన్నారని అన్నారని… ప్రతి ఏడాది జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.. చేశారా అని నిలదీశారు. అగ్రిగోల్డ్ బాధితుల హామీని నెరవేర్చారా అని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేస్తామని…పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని, సకాలంలో పీఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వ ఉద్యోదగులకు ఇచ్చిన హామీ నెరవేరిందా..? అని తులసిరెడ్డిప్రశ్నించారు.