కేపీ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపణలు

213

ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను ఆర్మీ ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్‌ చేసేందుకు.. వైద్యులపై కేపీరెడ్డి ఒత్తిడి తెచ్చారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు రఘురామ ఫిర్యాదు చేశారు. రాజ్‌నాథ్‌సింగ్‌కు మూడు పేజీల లేఖను అందజేశారు. కేపీ రెడ్డి, టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిలు తనను ఏపీ సీఐడీకి అప్పగించేందుకు కుట్రపన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మఫ్టీ పోలీసులు ఆస్పత్రిలో మకాం వేసేందుకు కేపీ రెడ్డి సహకరించారని ఆరోపించారు. 15 మంది ఏపీ పోలీసుల మెస్ బిల్లులను కూడా లేఖకు రఘురామ జతపర్చారు. కేపీ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు.