వినుకొండ ప్రభుత్వాసుపత్రి ని 100 పడకలుగా అభివృద్ధి చేయండి

239

-సీఎం జగన్ ను కోరిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
-వర్వ్యువల్ విధానంలో సీఎం చేతుల మీదుగా పిడుగురాళ్ల మెడికల్ కళాశాల శంకుస్థాపన
నెరవేరుతున్న చిరకాల కల
 -మెడికల్ కళాశాల స్థాపనతో తీరనున్న వైద్యం ఇబ్బందులు
సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోతున్న సందర్భాలు
-మెరుగైన వైద్యం దిశగా మెడికల్ కళాశాల స్థాపన చేస్తున్నందున సీఎంకు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కృతఘ్నతలు

ఇటీవల మాచర్ల ప్రభుత్వాసుపత్రిని 100 పడకలుగా అభివృద్ధి చేయుటకు ఆమోదం తెలిపారు.. అలాగే వినుకొండ ప్రభుత్వాసుపత్రిని కూడా 100పడకలుగా మార్చాలని..సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. సోమవారం వర్చ్యువల్ విధానంలో సీఎం జగన్ చేతుల మీదుగా జరిగిన పిడుగురాళ్ల మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. పిడుగురాళ్ల వద్ద గల బ్రాహ్మణ పల్లి వద్ద  శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా సీఎంతో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు..పల్నాడు ప్రాంతం మెడికల్ సదుపాయాలకు ఆమడ దూరంలో ఉందనే చెప్పాలి. మెరుగైన వైద్యం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి.ఒక్కోసారి ప్రాణాలు విడిచిన సందర్భాలు. ఇటీవల వినుకొండకు చెందిన లేడీ కానిస్టేబుల్ సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడిచింది. ఇలాంటి పరిస్థితులను మారుస్తూ.. ఈరోజు ఈమెడికల్ కళాశాలను నిర్మించటం ఎంతో సంతోషం. పలనాడు ప్రజల తరుపున సీఎం కు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. వైద్య కళాశాల తో వైద్య విద్య చేరువ అవుతుంది, మంచి వైద్యులను తయారుచేసుకోవచ్చు. వైద్య సిబ్బందితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసుకోవచ్చు. ఎంపీ చెప్పిన ప్రతి అంశాన్ని పరిశీలించి… నెరవేరుస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.