6వ రోజు అర్చకులకు,పాస్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ

230

గుంటూరు: స్థానిక బ్రాడీపేట 4/9లోని “బ్రాహ్మణ చైతన్య వేదిక” రాష్ట్ర కార్యాలయంలో   సోమవారం ఉదయం పండరిపురం,నగరంపాలెం,సంగడిగుంట,రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతాల్లోని ప్రవేట్ దేవాలయాలలో పనిచేసే “బ్రాహ్మణ అర్చకులకు…. మరియు   మద్దిరాల కాలనీ,ఆనంద్ పేట, ఉప్పలపాడు,పట్టాభిపురం, ఏ.టి.అగ్రహారం,ఎటుకురు రో చర్చి లలో పనిచేస్తున్న “పాస్టర్లకు,ఫాదర్లకు”  రాష్ట్ర కార్యాలయంలో నిత్యావసర సరుకులను బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు వేంకట శ్రీధర్ శర్మ  ఆధ్వర్యంలో “పొన్నాడ మధుసూదన్ శ్రీనివాస్ సహకారంతో హిందూ, ముస్లిం,క్రిస్టియన్  ప్రార్ధనాలయాలలో  పనిచేస్తున్న  కుటుంబాలకు
అందచేశారు.

 ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హిందూ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఏటూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ గుంటూరు నగరం మరియు పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ కర్ఫ్యూ నేపథ్యంలో పేద,మధ్యతరగతి బ్రాహ్మణ,క్రిస్టియన్, ముస్లిం ప్రార్ధనాలయాలలో పనిచేస్తున్న కుటుంబాలు ఆర్థికముగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆకలికి కులం,మతం,ప్రాంత భేదాలు ఉండవని, ఈ కరోనా కారణంగా ప్రజలు గుడి,చర్చ్ ,మసీదులకు వెళ్లటం లేదని, భక్తులిచ్చే కానుకల వల్ల వారి కుటుంబాలకు జీవనోపాధి సాగేదని ఇప్పుడు హిందు,ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన ప్రీస్ట్ లు అనేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న నేపద్యంలో  వారికి 3 వారాలకు సరిపోయే నిత్యావసర వస్తువుల్ని బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా కర్ఫ్యూ సడలించే వరకు ఈ సహకారం ప్రతిరోజు అందజేయడం జరుగుతుందని తెలిపారు.
  శిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ ఈ “కరోనా కర్ఫ్యూ సడలించే వరకు” ఆదర్శ భావాలతో ఈ సేవా కార్యక్రమం ప్రతిరోజు రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించటం జరుగుతుందని శ్రీధర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొడుగుల శ్రీహర్ష వడ్లమూడి రాజ,  వడ్డమాను ప్రసాదు,  మతుకుమల్లి సాయి, వేములపాటి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.