నా 19 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇవే సుమధుర క్షణాలు.

428

– 31వ తేదీ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదగా మెడికల్ కళాశాల శంకుస్థాపన
– 150 మందికి మాత్రమే అనుమతి.

నా 19 ఏళ్ల రాజకీయ చరిత్రలో నేను ఎదుర్కొన్న ఎన్నో ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు అన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో జత కలిసి ప్రయాణం  మొదలు పెట్టిన తర్వాత 2021 మే 31వ తేదీన జరగనున్న మెడికల్ కళాశాల, టీచింగ్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమం తో నా కష్టాలన్నీ మర్చిపోతున్నాను అని ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు.

శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా నాన్న గారైన స్వర్గీయ కోన ప్రభాకర్ రావు గారికి బాపట్లలో మెడికల్ కళాశాలను, పెద్దాస్పత్రిని ఏర్పాటు చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు కానీ అప్పట్లో అది సాధ్యపడలేదు అన్నారు. అనంతరం బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పాటు చేసి బాపట్లను ఆయన ఒక ఎడ్యుకేషన్ హబ్ గా మార్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అనంతరం మాజీ శాసనసభ్యుడు శేషగిరి రావు కూడా మెడికల్ కళాశాల కోసం ప్రయత్నం చేశారని, అదికూడా సాధ్యపడలేదు అన్నారు.పండే ప్రతి కింద మీద తినే వారి పేరు రాసిపెట్టి ఉంటుంది అన్నట్లుగా ఎవరి చేతుల్లో అయితే మెడికల్ కళాశాల శంఖుస్థాపన జరగాలి అని రాసిపెట్టి ఉందొ ఆ చేతులమీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగడం ఎంతో శుభపరిణామమన్నారు. ఆ అవకాశం నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు.

 ఒక దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రితో పనిచేయటం ప్రస్తుతం ఉన్న 150 మంది ఎమ్మెల్యేల పూర్వజన్మసుకృతం అన్నారు. సోమవారం ఉదయం పది గంటలకు బాపట్ల మెడికల్ కళాశాలకు, టీచింగ్ హాస్పిటల్ కు  గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో లో శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి కేవలం 150 మందిని మాత్రమే కరోనా కారణంగా అనుమతి ఇస్తున్నారని, ఇది ఒక పండుగల జరుపుకోవాల్సిన కార్యక్రమం అన్నారు. ఈ విధంగా జరగడం నాకు కొంత అసంతృప్తి గా ఉందన్నారు. అయినప్పటికీ మరొక సందర్భంలో మనం ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుద్దాము అన్నారు.నూతనంగా ఏర్పడబోయే బాపట్ల జిల్లా కు అత్యంత ప్రాముఖ్యమైన టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కళాశాల కు శంకుస్థాపన జరగటం బాపట్ల పట్టణానికె కాకుండా నియోజకవర్గ ప్రజలకు ఎంతో సంతోషకరమైన క్షణాలు అన్నారు. వ్యక్తిగతంగా అందరూ హాజరు కాలేకపోయినా బాపట్ల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఈ భూమి పూజ కార్యక్రమానికి ఉండాలని ఆయన కోరారు.