అవినీతిపై పోరులో ’రివర్స్‌ టెండరింగ్‌’ విజయాలు

169

ప్రజాధనం దుర్వినియోగానికి  వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చెక్‌
అక్రమాలకు ముకుతాడు
కమీషన్ల కోసం గత సర్కార్‌ హయాలలో అవినీతి టెండ’రింగ్‌’ ల గుట్టురట్టు
’రివర్స్‌’ తో పారదర్శకంగా టెండరింగ్‌ ప్రక్రియ
రివర్స్‌ టెండరింగ్‌తో పాటు మరింత పారదర్శకత కోసం జ్యుడీషియల్‌ ప్రివ్యూ విధానం
పోలవరం నుంచి టిడ్కో ఇళ్ల వరకు భారీగా ప్రజాధనం ఆదా
రెండేళ్లలో రూ.5070.43  కోట్లు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రజాధనం ఆదా

·అమరావతి.·
ప్రాజెక్టులు, పనులు, కాంట్రాక్టుల్లో అత్యంత పారదర్శక విధానాన్ని జగన్‌ ప్రభుత్వం తీసుకు వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనూ రివర్స్‌టెండరింగ్, జ్యుడిషియల్‌ప్రివ్యూ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కీలక సంస్కరణల ద్వారా గడచిన రెండేళ్లలో రూ.5,070.43 కోట్ల రూపాయలను ఆదాచేసింది.
పోలవరం మొదలు అనేక సాగునీటి ప్రాజెక్ట్‌ లు, మున్సిపల్, విద్యాశాఖ, వైద్యశాఖ, విద్యుత్, హౌసింగ్, పంచాయతీరాజ్‌ సహా పలు శాఖల్లో పనులు, కాంట్రాక్టులకు సంబంధించి అత్యంత పారదర్శక విధానాలు పాటించడం ద్వారా భారీగా ప్రజా ధనాన్ని ఆదాచేయగలిగారు.

రివర్స్‌  టెండరింగ్‌తో మొత్తం రూ. 5070.43  కోట్లు ఆదా
–––––––––––––––––––––––––
1. పోలవరం ప్రాజెక్టు సహా జలవనరులశాఖలో 26 పనులకు గాను        : రూ.1824.65 కోట్లు
2. ఏపీ టిడ్కో(గృహనిర్మాణశాఖ)లో 12 పనులకు గాను         : రూ.392.23 కోట్లు
3. గృహనిర్మాణశాఖ (రూరల్‌)లో 5 పనులకు గాను      : రూ.811.32  కోట్లు
4.పంచాయతీరాజ్‌శాఖలో 7 పనులకు గాను                : రూ. 605.08 కోట్లు
5. ఏపీ జెన్‌కోలో 4 పనులకు గాను                : రూ. 486.46 కోట్లు
6. విద్యాశాఖలో 21 పనులకు గాను                                  : రూ. 325.15 కోట్లు
7. ఏపీఎంఎస్‌ఐడీసీలో 34 పనులకు గాను        : రూ. 625.54  కోట్లు

·జలవనరులశాఖలో రివర్స్‌ ద్వారా మిగులుధనం·
1). పోలవరం ప్రాజెక్టుతో పాటు జలవనరుల శాఖలో 26 పనులకు సంబంధించి  రివర్స్‌టెండరింగ్‌ ద్వారా రూ.1824.65 కోట్లు ప్రజాధనాన్ని ఆదా చేయగలిగింది.

·2). పేదల ఇళ్ళ నిర్మాణంలోనూ భారం తగ్గించిన రివర్స్‌ టెండరింగ్‌·
రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం అందించే పక్కాగహాల నిర్మాణంలోనూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. అధికరేట్లకు టెండర్లకు ఆమోదం తెలపడం ద్వారా అటు ప్రజాధనంను దుర్వినియోగం చేయడంతో పాటు, ఇటు సబ్సిడీ తరువాత లబ్దిదారులు తమవంతుగా తిరిగి చెల్లించాల్సిన సొమ్మును కూడా అధికం అయ్యేలా చేశారు. ఈ విధానంపై శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిస్థాయి దష్టి సారించింది. ఎపి టౌన్‌ షిప్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ (టిడ్కో) లో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. దీంతో గహనిర్మాణశాఖ (ఏపీ టిడ్కో)లో 12 పనులకు చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా  రూ. రూ. 392.23 కోట్ల రూపాయల ఆదా జరిగింది.
3), మరోవైపు గహనిర్మాణశాఖలో గ్రామీణ ప్రాంతాల్లో 5 పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్‌టెండరింగ్‌లో రూ.811.32 కోట్లు ప్రభుత్వం ఆదా చేసింది.
4),పంచాయితీరాజ్‌ శాఖకు సంబంధించి 7 పనులకు గాను రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తే… రూ.605.08 కోట్ల ప్రజాధనం ఆదా అయింది.
5, ఏపీ జెన్‌క్‌లో 4 పనులకు గాను రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా రూ.486.46 కోట్ల ప్రజా ధనం ఆదా అయింది.
6, విద్యాశాఖలో కూడా గత ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున ప్రజాధనం వధా కాగా వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 పనులుకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా… రూ. 325.15 కోట్లు ఆదా అయ్యాయి.
7, వైద్యఆరోగ్యశాఖలో కూడా గత ప్రభుత్వ హయాంలో టెండర్లలో చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు నేపధ్యంలో… ఆంధ్రప్రదేశ్‌ మెడికిల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఎంఎస్‌ఐడీసీ)లో 34 పనులకు సంబంధించి నిర్వహించిన రివర్స్‌ టెండర్లలో రూ. 625.54 కోట్లు ప్రజాధనం ఆదా అయింది.

మొత్తం రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ ద్వారా 7 ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ.5070.43 కోట్లు ప్రజాధనం ఆదా అయింది.