సాయం కోసం పోయి..Ntv చంద్రశేఖర్ సోదరుడు మృతి..

274

వినుకొండ: సాయం చేయడానికి పోయి ప్రాణం పోగొట్టుకున్న మానవ హృదయ విదారక సంఘటన మండల కేంద్రమైన ఈపూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది….
Ntv ap బ్యూరో చంద్ర శేఖర్ సోదరుడు రావూరి కోటేశ్వరరావు మృతి అందరినీ కలిచివేసింది..
ఈపూరు లోని ఎదురింటి వారైనా నా మాజీ సైనికుడు  పూర్ణచంద్రరావు 39 ; కరోనా సోకి గుంటూరు లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయాడు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులతో పాటు సాయం కోసం కోటేశ్వరావు కూడా వెళ్ళాడు. పూర్ణచంద్రరావు మృతదేహాన్ని అంబులెన్స్లో తీసుకుని వస్తుండగా ఫిరంగిపురం వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
అంబులెన్సు ని కారు ఢీకొనడంతో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు ఈ సంఘటన అందరిని విషాదంలో ముంచింది..కరోనాతో మరణించిన పూర్ణచందర్రావు మరణవార్తను ప్రచురించిన కొన్ని గంటలకే ntv చంద్రశేఖర్ సొంత అన్న మరణ వార్త వినవలసి వచ్చింది..
సమాచారం తెలుసుకున్న నరసరావుపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు కుటుంబ సభ్యులైన Ntv చంద్ర శేఖర్ కు ఫోన్ చేసి పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు..