అక్కచెల్లెమ్మలకు జగన్‌ పాలన అగ్ర తాంబూలం

227

– అన్నింట్లో అక్క చెల్లెమ్మలకు అత్యధిక ప్రాధాన్యం
– రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వారి వృద్ధి
-మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవుల్లో మహిళలకు ప్రాధాన్యం
– మేయర్లు, ఛైర్మన్లుగా అత్యధిక స్థానాల్లో అక్క చెల్లెమ్మలు
-పథకాలు, కార్యక్రమాలలో వారికే అధిక పెద్ద పీట
– నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పదవుల్లో సగం
– దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా రక్షణ చర్యలు
– దిశ చట్టం. దిశ పోలీసు స్టేషన్లు. మహిళా రక్షక్‌ వాహనాలు
– ఈ రెండేళ్లలో మొత్తం 4,36,60,516 మహిళా ప్రయోజనాలు
– ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.88,040.29 కోట్ల లబ్ధి
– అక్క చెల్లెమ్మల పేరుతోనే ఇళ్ల స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్‌
– వివిధ పథకాల ప్రయోజనాలూ నేరుగా వారి ఖాతాల్లోనే
– డిప్యూటీ సీఎం, హోం మంత్రి పదవి కూడా మహిళకే
ఇదే సీఎం వైయస్‌ జగన్‌ రెండేళ్ల పాలన

‘ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. అలా ప్రతి ఇల్లు బాగుంటనే రాష్ట్రం బాగుంటుంది’.. అని చెప్పే ముఖ్యమంత్రి   వైఎస్‌ జగన్‌ తన రెండేళ్ళ పాలనలో అక్కచెల్లెమ్మలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలిస్తూ అగ్ర తాంబూలం కల్పించారు. మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేస్తూ, వారి సాధికారతే లక్ష్యంగా సీఎం రెండేళ్ల పాలన కొనసాగింది.

పధకాలు – మహిళల ప్రాధాన్యం:

1. జగనన్న అమ్మ ఒడి కింద రూ.13,022.93 కోట్లు.
– పేదరికం కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకంలో రెండేళ్లలో 44,48,865 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ,13,022.93 కోట్లను జమ చేశారు.

2. వైఎస్సార్‌ కాపునేస్తం కింద రూ.491.79 కోట్లు
– కాపుల్లో పేద మహిళలకు ఉపాధి కల్పించడంలో భాగంగా ప్రభుత్వం వైఎస్సార్‌ కాపు నేస్తం కింద 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసింది.

3. వైఎస్సార్‌ చేయూత:
– ఈ పథకంలో తొలివిడతలో భాగంగా 24,55,534 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల బ్యాంకు ఖాతాలలో రూ.4,604.13 కోట్లు జమ చేశారు.

4. వైఎస్సార్‌ సున్నా వడ్డీ:
–  ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం  వైయస్‌ జగన్, అధికారంలోకి రాగానే పొదుపు సంఘాల్లోని 98,00,626 మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.2,354.22 కోట్లు జమ చేశారు.

5. వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద రూ.115.12 కోట్లు
– వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద 25,112 మంది లబ్దిదారులకు రూ.115.12 కోట్లు విడుదల చేసి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపింది.

6. వైఎస్సార్‌ ఆసరా కింద 77.75 లక్షల మందికి రూ.6,310 కోట్లు
– ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో తిరిగి అక్క చెల్లెమ్మలకే ఇస్తానని మాట ఇచ్చిన సీఎం,  తొలి విడతగా వైఎస్సార్‌ ఆసరా పేరిట 77,75,681 మంది మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.6,310.68 కోట్లు జమ చేశారు.

7. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక:
– వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 36,70,425 మందికి రూ.19,306.20 కోట్లు జమ చేసి వారికి అండగా నిల్చారు.

8. వైఎస్సార్‌ రైతు భరోసా:
– ౖపథకంలో 17,27,249 లక్షల మహిళా ౖరైతులకు రూ.5,615.66 కోట్లు జమ చేశారు.

9. వైయస్సార్‌ మత్య్సకార భరోసా:
– ఈ పథకంలో 2,294 మందికి రూ.6.96 కోట్లు విడుదల చేసింది

10. జగనన్న వసతి దీవెన:
– పిల్లలకు హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద జగనన్న వసతి దీవెన పథకంలో 15,56,956 తల్లుల ఖాతాల్లో రూ.2,269.93 కోట్లు నగదు జమ చేశారు.

11. జగనన్న విద్యా దీవెన:
– విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తూ అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకంలో 10,88,439 పిల్లల తల్లుల ఖాతాల్లో రూ.2,477.89 కోట్లు జమ చేశారు.

12. వైఎస్సార్‌ వాహనమిత్ర:
– ఈ పథకంలో భాగంగా 24,188 మంది ఖాతాల్లో రూ.45.69 కోట్లు నగదు జమ

13. వైఎస్సార్‌ లా నేస్తం:
– ఈ పథకంలో 721 మందికి రూ.3.24 కోట్లు నగదు జమ

14. జగనన్న చేదోడు:
– పధకంలో భాగంగా రజక, టైలర్లు, నాయి బ్రాహ్మణులు 1,36,340 మందికి రూ.136.34 కోట్లు నగదు జమ

15. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా:
– ఈ పథకం కింద 1,69.516 మందికి రూ.115 కోట్ల ఆర్థిక సహాయం.
ఆ విధంగా డీబీటీ కింద మొత్తం 3,32,09,808 మందికి రూ.56,875.78 కోట్లు జమ చేశారు

ఇక నాన్‌ డీబీటీ (పరోక్షంగా ఆర్థిక సహయం) లబ్దిదారుల వివరాలు:

16. జగనన్న గోరుముద్ద:
– ఈ పథకంలో 18,20,196 మందికి రూ.789.54 కోట్లు

17. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ:
– ఈ పథకం కింద 30,16,000 మందికి రూ.1,863.13 కోట్లు

18. వైయస్సార్‌ జగనన్న లేఅవుట్లు:
– ఈ పథకంలో భాగంగా రూ.27 వేల కోట్ల విలువైన 30.76 లక్షల ఇళ్ల స్థలాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌.

19.  వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ:
– ఈ పథకంలో 3,51,540 మందికి రూ. 1,177.23 కోట్లు

20. జగనన్న విద్యాకానుక:
– పథకంలో కింద 21,86,972 మందికి రూ.334.61 కోట్లు

ఈ విధంగా నాన్‌ డీబీటీ కింద 1,04,50,708 మందికి రూ.31,164.51 కోట్ల ప్రయోజనం కల్పించారు.

ప్రత్యక్షంగా–పరోక్షంగా:
మొత్తం డీబీటీ, నాన్‌ డీబీటీ కింద మహిళలకు సంబంధించి మొత్తం  4,36,60,516 ప్రయోజనాలు కలగగా, వారికి రూ.88,040.29 కోట్ల లబ్ధి చేకూరింది.

మహిళలకు మహోన్నత ‘దిశ’:
రాష్ట్రంలో మహిళా రక్షణకు ది«శ చట్టం తీసుకువచ్చిన ప్రభుత్వం, ప్రత్యేకంగా దిశ పోలీసు స్టేషన్లు కూడా ఏర్పాటు చేసింది. వారి కోసం ప్రత్యేకంగా రక్షక్‌ వాహనాలు కూడా నిర్వహిస్తోంది. 18 దిశ పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేకంగా హెల్ప్‌ కియోస్క్‌లు, 700 పోలీస్‌ స్టేషన్లలో ఉమెన్‌ స్పెషల్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. దిశ పోలీస్‌ స్టేషన్‌లకు 18 దిశ ఇంటిగ్రేటెడ్‌ క్రై ం సీన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్స్‌ (కస్టమైజ్డ్‌ బస్‌లను) అందించారు.
తిరుపతి, విశాఖపట్నం, మంగళగిరిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. 11 ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మహిళా పోలీసులకు 900 పెట్రోలింగ్‌ వెహికల్స్‌ (ద్విచక్ర వాహనాలు) అందిస్తున్నారు.

ఇప్పటికే ఫలితాలు:
రాష్ట్రంలో మహిళలకు దిశ పటిష్టమైన కవచంగా నిలుస్తోంది. దిశ కార్యక్రమం వల్ల మహిళలపై నేరాలు 7.5 శాతం తగ్గడం విశేషం. దిశ బిల్లులో ప్రస్తావించినట్టు ఏడు రోజుల్లోనే 561 కేసుల్లో, 15 రోజుల్లో 1,157 కేసుల్లో చార్జిషీట్‌ వేశారు. ఇప్పటివరకు 108 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మహిళలను సోషల్‌ మీడియా ద్వారా వేధిస్తున్న 1,531 మందిపై సైబర్‌ బుల్లీయింగ్‌ షీట్స్‌ తెరిచారు. లైంగిక వేధింపులకు పాల్పడే 1,194 మందిపై షీట్స్‌ తెరిచారు.

నియామకాల్లో, సేవల్లో ఆమెకే పెద్ద పీట:
రాష్ట్రంలో సేవల రంగంలో అతిపెద్ద శాఖగా పేరున్న వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగ నియామకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు.
– ఒక్క ఏడాదిలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో భాగంగా 13 వేల ఏఎన్‌ఎంలను నియమించారు.
– ఆశా కార్యకర్త్తలకు ఒకేసారి రూ.10 వేల వేతనం చేసిన ఘనత ఈ సర్కారుదే. గతంలో వీరికి రూ.3 వేలే ఇచ్చేవారు.

పదవుల్లోనూ ప్రాధాన్యం:
ఒక డిప్యూటీ సీఎంతో పాటు, హోం మంత్రి పదవి మహిళకు ఇచ్చి రక్షణలో మహిళలకు భరోసా కల్పించారు. నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనులు, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం మహిళలకు ఇచ్చే విధంగా చట్టాలు రూపొందించారు.
ఇక మున్సిపల్‌ పదవుల్లో కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం మేయర్లు, ఛైర్మన్ల పదవుల్లో మహిళలకు 42 పదవులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ సీఎం  వైయస్‌ జగన్‌ 60.47 శాతం ఎక్కువగా ఏకంగా 52 పదవులు ఇచ్చారు.
ఆ విధంగా తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని సీఎం వైయస్‌ జగన్‌ మరోసారి నిరూపించారు.