“అన్న” అనే పదానికి అర్థం జగనన్న రెండేళ్ళ పాలన!

290

– రెండేళ్ళపాలనలో ఎన్నో అద్భుతాలు సాధించాం.. సంబరాలు చేసుకోవాలి కానీ, ప్రచారార్భాటాలకు ఇది సమయం కాదు
– జగన్ పరిపాలనలో రాజకీయ వ్యవస్థను మార్చాం.. ఎన్నికల మేనిఫెస్టో అర్థమే మార్చాం.
– నాయకుడు మాట ఇస్తే.. ఇంతగా కట్టుబడి ఉంటాడా.. అన్నదానికి నిదర్శనం జగనన్న పాలన
– ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనుకునే నాయకులు దేశంలో ఎక్కడున్నాజగన్ పాలన వైపే చూస్తారు
– నాయకుడు అంటే ఎలా ఉండాలో  జగన్ ను చూసి.. ఎలా ఉండకూడదో చంద్రబాబును చూసి నేర్చుకోవాలి
– అన్ని ఎన్నికల్లో ఎగిరింది ఒకటే జెండా అదే జగన్ మోహన్ రెడ్డి జెండా.. వైయస్ఆర్ కాంగ్రెస్ జెండా.
– ప్రజల గుండెల్లో చిరస్మరనీయమైన ముద్ర వేసుకున్న నాయకుడు  జగన్ మోహన్ రెడ్డి.
– చంద్రబాబు నాయుడుది ముగిసిన చరిత్ర.. ఆయన సినిమా అయిపోయింది.
–   వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు    

వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకుని, మూడవ సంవత్సరంలోకి ప్రవేశించబోతున్న తరుణంలో.. ఈ రెండేళ్ళ పరిపాలనలో ఇచ్చిన మాటకు కట్టుబడి 95 శాతం వాగ్దానాలను అమలు చేశాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ కాలంలోనే ఇన్ని వాగ్దానాలను అమలు చేయడమనేది ఒక చరిత్ర. గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలో బహుశా ఇలా జరిగి ఉండదు.

– నాయకుడు మాట ఇస్తే.. ఇంతగా కట్టుబడి ఉంటాడా.. అన్న దానికి జగనన్న పరిపాలనే నిదర్శనం. జగన్ మోహన్ రెడ్డిగారు చెప్పాడంటే.. చేస్తాడంతే.. అన్నరీతిలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని, నెరవేర్చిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి  ఈ విషయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగర్వంగా చెప్పుకుంటుంది.

-కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయాలు అసలే చూడం.. అని చెప్పి ఆ మాటలను నిజం చేసే విధంగా అమలు చేసి, అర్థం చూపిన పాలన జగనన్న పాలన.
– సెక్రటేరియేట్ అంటే రాజధానిలో ఎక్కడో ఒకచోట మాత్రమే ఉంటుందనే భావన లేకుండా, గ్రామ గ్రామాన ఉంటుంది అని నిరూపించిన పాలన జగనన్న పాలన.

– రూ. 1.25 లక్షల కోట్లు మధ్యవర్తులు, సిఫార్సులు, అవినీతి లేకుండా నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో వేసిన పాలన జగనన్న పాలన.

ఈ రాష్ట్రానికి చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు కానీ, ప్రజల నుంచి డైరెక్టుగా ముఖ్యమంత్రి అయిన వారు చాలా అరుదు. ఫలానా నాయకుడు కోసం మేం ఓటు వేస్తున్నాం, వారు ముఖ్యమంత్రి అవ్వటం కోసమే ఓట్లు వేసి గెలిపించినటువంటి నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో చూస్తే.. టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్టీఆర్, డాక్టర్ వైయస్ఆర్, ఆ తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో డైరెక్టు అధికారం పొందినటువంటి నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి.

– అన్నా అనే మాటకు అర్థం.. ఈ రెండేళ్ళ జగనన్న పాలన. దేశంలో, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని తాపత్రయపడే నాయకులు ఎక్కడ ఉన్నా ఈ రాష్ట్రంవైపే, జగనన్న వైపే చూస్తున్నారు.

– అలా ప్రజల గుండెల్లో చిరస్మరనీయమైన ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.
– ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం, మరోవైపు అవినీతి లేని చక్కని పరిపాలనను అందిస్తోన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

నాయకుడు ఎలా ఉండాలో, పరిపాలన ఎలా ఉండాలో చూడాలంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి, జగన్ మోహన్ రెడ్డి  పరిపాలన వైపు చూస్తారు. నాయకుడు అంటే ఎలా ఉండకూడదో.. అని నేర్చుకోవాలంటే కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారు.

– 2019 ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు గెలుచుకుంది. చాలా మంది ఓట్లు వేశారు. మా పార్టీకి ఓట్లు వెయ్యని వాళ్ళని కూడా, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఈ రెండేళ్ళలో తనవైపు తిప్పుకుని, తన నాయకత్వం వైపు నడిపించుకున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.

జగన్ మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలనతో ప్రతిపక్షాలు బలహీనపడిపోయాయి. జగన్ మోహన్ రెడ్డిగారు ప్రజల్ని తన వైపు నడిపించుకోవడం ద్వారా ప్రతిపక్షాల వైపు ప్రజలు చూసే పరిస్థితి లేదు. పంచాయతీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు.. ఏ ఎన్నికలు చూసినా ఎగిరింది ఒకటే జెండా అదే జగన్ మోహన్ రెడ్డిగారి జెండా. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా.

2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో కేవలం 23 సీట్లు సాధించి  టీడీపీ అంపశయ్య మీదకు వెళ్ళింది.

– ఆ తర్వాత వచ్చిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అంపశయ్య మీద ఉన్నటువంటి టీడీపీకి అంత్యక్రియలు జరిగిపోయాయి. ఇక మిగిలింది బూడిద మాత్రమే. బూడిదతో పాటు జూమ్, అదికూడా తెలంగాణలో, చంద్రబాబు ఇంట్లో మిగిలింది.

– ఇక చంద్రబాబు నాయుడుది ముగిసిన చరిత్ర. ఆయన సినిమా అయిపోయింది. ఈ విషయం ప్రజలతో పాటు తెలుగుదేశం నాయకులకు చాలా చక్కగా అర్థమవుతుంది.
రెండేళ్ళ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో, సంక్షేమంలో, అభివృద్ధిలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. రాజకీయ వ్యవస్థను మార్చాం. ఎన్నికల మేనిఫెస్టో అర్థమే మార్చాం. మేనిఫెస్టో అంటే పేజీలకు పేజీలు అచ్చువేసి, ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసి,  తిరిగి ఎన్నికలు వచ్చేసరికి దానిని చూపించాలంటేనే భయపడిపోయి దాచిపెట్టడం, వెబ్ సైట్ నుంచి తొలగించడం లాంటి పనులు చేసే టీడీపీ పార్టీని చూశాం.

– మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ అని భావించి, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను త్రికరణ శుద్ధిగా అమలు చేసి, భారతదేశంలో మొదటిసారిగా నిరూపించిన పరిపాలన జగన్ ది.
కోవిడ్ తో దేశం, ప్రపంచం అతలాకుతలమవుతున్నా.. సమర్థవంతమైన నాయకత్వంతో, ఇచ్చిన మాట తప్పం- ఎంత కష్టం వచ్చినా ప్రతి మాటను నెరవేర్చితీరుతాం అని.. 95 శాతం వాగ్దానాలను అమలు చేసి చూపించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు.

– మేనిఫెస్టోలోని 129 వాగ్దానాల్లో 107 అమలు ఇప్పటికే పూర్తి చేశాం. పోలవరం, నాడు-నేడు లాంటి మరో 14 వాగ్దానాలు అమలులో ఉన్నాయి. ఇక మిగిలింది కేవలం 8 మాత్రమే. వాటినీ రాబోయే మూడేళ్ళలో అమలు చేస్తాం.
ఇంత చక్కటి, చిత్తశుద్ధితో కూడిన పరిపాలనను అందిస్తోన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. రెండేళ్ళ కాలంలో ఇన్ని అద్భుతమైన ఫలితాలు సాధించింది. వాస్తవానికి ఇంత పెద్ద విజయానికి పెద్దఎత్తున సంబరాలు చేసుకోవాలి. కానీ, ప్రచారానికి, పండుగలకు, ఆర్భాటాలకు ఇది సమయం కాదు. దేశంలో, రాష్ట్రంలో కరోనా కరాళనృత్యం చేస్తున్న పరిస్థితులో అందరం కలిసికట్టుగా, జాతి మొత్తం సమైక్యంగా కనిపించని శత్రువు మీద యుద్ధం చేయాల్సిన సమయం ఇది.

– జగన్ మోహన్ రెడ్డిగారి రెండేళ్ళ అద్భుతమైన పరిపాలనకు జనం నీరాజనాలు పలికే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో క్యాలెండర్ కూడా ఇచ్చి,  ముందుగానే డేట్స్ ప్రకటించి అమలు చేస్తున్నాం. రెండేళ్ళలో సంక్షేమ పథకాలకు గాను ఒక లక్షా 25 వేల 425 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చాం.

పనీపాట లేని, ఊసుపోని రాజకీయ పక్షాలు కొన్ని, సినిమా అయిపోయిన చంద్రబాబు లాంటి వాళ్ళు జూమ్ ల్లో జగన్ మోహన్ రెడ్డిని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించి అభాసుపాలవ్వడం తప్ప మరొకటి లేదు.

– రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. చంద్రబాబు హయాంలో అప్పులు లేవా..

– ఇది ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ప్రాక్టికల్ గా పనిచేస్తున్న ప్రభుత్వం. అందుకే ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి నీరాజనాలు పలుకుతున్నారు.