గనులమంత్రి క్వారీలోనే అక్రమ బ్లాస్టింగా?

108

అవినీతి సొమ్ముకోసం పేదల ప్రాణాలను బలిపెడతారా?
తక్షణమే పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోండి
క్వారీ మూసివేసి సమగ్ర విచారణ జరపండి
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కడియాల కుంటలో సాక్షాత్తు రాష్ట్ర గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్వారీలో పేలుడు సంభవించి జాకీర్ అనే యువకుడు మృతిచెందడంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.  ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గనులశాఖను పర్యవేక్షించే మంత్రి క్వారీలోనే రక్షణ చర్యలు చేపట్టలేదంటే రాష్ట్రంలో మిగిలిన చోట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంధి. నెలరోజుల క్రితం ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లా కలశపాడు మండలం మామిళ్లపల్లి వైసిపి ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యకు చెందిన క్వారీలో పేలుడు సంభవించి పదిమంది పేదలు ప్రాణాలు కోల్పోయారు. అసంఘటన మరువకముందే మంత్రి పెద్దరెడ్డి క్వారీలో పేలుడు సంభవించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. సాక్షాత్తు మంత్రి క్వారీలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే మిగిలిన క్వారీల్లో పరిస్థితి ఏమిటి? ఈ ప్రభుత్వంలో పేదల ప్రాణాలంటే లెక్కలేదు, అవినీతి సొమ్ము కోసం ఇష్టారాజ్యంగా మైనింగ్ చేస్తూ అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు. నిబంధనలకు విరుద్దంగా బ్లాస్టింగ్ చేసి మైనారిటీ యువకుడి కారణమైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసు నమోదుచేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిర్లక్ష్యంగా బ్లాస్టింగ్ చేసినందున క్వారీ యజమాని అయిన పెద్దిరెడ్డి మృతుని కుటుంబానికి 50లక్షల రూపాయల పరిహారం వ్యక్తిగతంగా అందించాలి. తక్షణమే క్వారీని మూసివేసి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.