పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిలో ఒక విప్లవం

203

సీఎం  వైయస్‌.జగన్‌ రెండేళ్లపాలన పాలన
దేశంలో ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు
కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా వివక్ష లేకుండా అర్హులందరికీ లబ్ధి
అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాల లబ్ధిదారుల ఎంపిక
మానవాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడానికి విశేష ప్రయత్నం
కరోనా కష్టకాలంలోనూ ప్రజలను ఆదుకున్న పథకాలు
విద్య, ఆరోగ్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి

సంతృప్తి స్థాయిలో ప్రయోజనాలు.వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో 86 శాతం కుటుంబాలకు లబ్ధి
ఇందులో ఒకే పథకం అందుకున్న కుటుంబాలు 18 శాతం
రెండు, అంత కన్నా ఎక్కువ లబ్ధి పొందిన కుటుంబాలు 82 శాతం
మొత్తంగా 1,41,52,386 కుటుంబాలకు 8,89,18,040 ప్రయోజనాలు
డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి రెండేళ్లలో ఇచ్చిన మొత్తం రూ.1,31,725.55 కోట్లు
ప్రత్యక్ష నగదు బదిలీలో కింద  నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి రూ.95,528.50 కోట్లు
నాన్‌ డీబీటీకింద రూ.36,197.05 కోట్లు
పూర్తి పారదర్శకత. సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు
పక్కాగా సోషల్‌ ఆడిటింగ్‌. అర్హత ఉండి మిస్‌ అయితే మళ్లీ అవకాశం

అమరావతి:

‘నేను విన్నాను. నేను ఉన్నాను’.. సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అందరి కష్టాలు, కడగండ్లు స్వయంగా చూసి, వారి బాధలను విన్న తర్వాత నాడు విపక్షనేతగా ఉన్న సీఎం వైయస్‌ జగన్‌ చెప్పిన మాట ఇది.
సీఎం  వైయస్‌ జగన్, అధికారం చేపట్టిన నాటి నుంచి అందరి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా.. ముఖ్యంగా విద్యార్థులు, నిరుపేదలు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, సమగ్ర పురోగతి ధ్యేయంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
ప్రయోజనాలు. ఎంత మొత్తం:
– సరిగ్గా రెండేళ్ల క్రితం, 2019 మే 30న సీఎంగా ప్రమాణ శ్రీకారం చేసిన నాటి నుంచి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ నెల (2021 మే) వరకు..
సంతృప్తి స్థాయిలో ప్రయోజనాలు. వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలోని 86 శాతం కుటుంబాలకు లబ్ధి కలిగింది.
– రాష్ట్రంలో మొత్తం 1,64,68,591 కుటుంబాలు ఉంటే అందులో మొత్తంగా 1,41,52,386 కుటుంబాలకు 8,89,18,040 ప్రయోజనాలు అందాయి.
– ఇందులో ఒకే పథకం అందుకున్న కుటుంబాలు 18 శాతం
రెండు, అంత కన్నా ఎక్కువ పథకాలద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు 82 శాతం.
– ప్రత్యక్ష నగదు బదిలీలో కింద  నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి రూ.95,528.50 కోట్లు జమ అయ్యాయి.
– నాన్‌ డీబీటీ కింద రూ.36,197.05 కోట్లు లబ్ధి చేకూరింది.
– డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి రెండేళ్లలో ఇచ్చిన మొత్తం రూ.1,31,725.55 కోట్లు ఆయా కుటుంబాలకు అందాయి.
డీబీటీ కింద మొత్తం పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రత్యక్ష్యంగా ఏయే వర్గాలకు, ఎంతెంత లబ్ధి అన్నది చూస్తే..
–  నేరుగా నగదు బదిలీ పథకాల కింద అంటే డీబీటీ ద్వారా బీసీలకు 3,31,06,715 ప్రయోజనాలు జరిగితే, దీని కింద నేరుగా రూ.46,405.81 కోట్లు నగదు బదిలీ చేశారు.
–  డీబీటీలో భాగంగా ఎస్సీలకు 1,06,14,972 కోట్ల ప్రయోజనాలు అందితే దీని కింద రూ.15,304.57 కోట్లుగా నేరుగా వారి ఖాతాలకే పంపారు.
–  ఎస్టీలకు 29,71,144 ప్రయోజనాలు డీబీటీ కింద అందితే రూ.4,915.86 కోట్లను వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు.
– ఇక మైనార్టీలకు 19,88,961 ప్రయోజనాలను అందించగా, వీటి కోసం రూ.3,374.23 కోట్లు ఖర్చు చేశారు. ఈ డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డీబీటీ పథకాల ద్వారా పంపారు.
– ఇక కాపుల విషయానికొస్తే.. ఆ సామాజకి వర్గానికి చెందిన వారికి 30,85,472 ప్రయోజనాలు అందాయి. దీనిద్వారా రూ.7,368.20 కోట్లు అందించి శ్రీజగన్‌ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఇచ్చిన మాట మేరకు ఆ వర్గానికి అండగా నిలిచింది.
– వీరు కాక ఓసీ వర్గాలకు 1,49,21,396 ప్రయోజనాలు అందించి, వాటి ద్వారా రూ.18,246.83 కోట్లు నగదు బదిలీ చేసింది. ఆర్థికంగా వెనకబడి, పేదరికంతో బాధపడుతున్న అగ్రవర్ణాలకూ అండగా నిలిచింది.
డీబీటీలో ఏయే వర్గాలకు ఎంతెంత:
వర్గం సంఖ్య మొత్తం
(కోట్లలో)
బీసీ 3,31,06,715 46,405.81
ఎస్సీ 1,06,14,972 15,304.57
ఎస్టీ 29,71,144 4,915.86
మైనారిటీలు 19,88,961 3,374.23
కాపు 30,85,472 7,368.20
ఇతరులు 1,49,21,396 18,246.83

నాన్‌ డీబీటీలో ఏయే వర్గాలకు ఎంతెంత:
– నాన్‌ డీబీటీ పథకాలు, కార్యక్రమాల ద్వారా బీసీ వర్గాలకు 1,21,51,552 ప్రయోజనాలను అదించారు. దీనికోసం ఈ రెండేళ్లకాలంలో రూ. 19,346.39 కోట్లు ఖర్చు చేశారు.
– ఎస్సీలకు 47,67,751 ప్రయోజనాలను నాన్‌ డీబీటీ కింద కల్పించారు. వీటికోసం చేసిన ఖర్చు రూ.  7,155.01 కోట్లు.
– ఎస్టీలకు  17,11,117 ప్రయోజనాలను కల్పిస్తే.. రూ. 1,730.93 ఖర్చుపెట్టారు.
– మైనారిటీలకు 6,17,808 ప్రయోజనాలు నాన్‌ డీబీటీ కింద కల్పిస్తే… రూ. 2,635.14కోట్లు వ్యయం చేశారు.
– కాపులకు 3,96,880 ప్రయెజనాలను కల్పిస్తే రూ. 2,304.05కోట్లు ఖర్చు చేశారు.
– అగ్రవర్ణాలకు 39,70,042 ప్రయోజనాలను కల్పిస్తే.. నాన్‌డీబీటీకింద వీరికోసం రూ. 3,025.53 కోట్లు ఖర్చు చేశారు.
నాన్‌ డీబీటీ కింద మొత్తం పథకాలు, కార్యక్రమాల ద్వారా పరోక్షంగా ఏయే వర్గాలకు, ఎంతెంత లబ్ధి అన్నది చూస్తే..
వర్గం అందిన ప్రయోజనాల
సంఖ్య   మొత్తం
(కోట్లలో)
బీసీ 1,21,51,552 19,346.39
ఎస్సీ 47,67,751 7,155.01
ఎస్టీ 17,11,117 1,730.93
మైనారిటీలు 6,17,808 2,635.14
కాపు 3,96,880 2,304.05
ఇతరులు 39,70,042 3,025.53