పేదవాడు చస్తేమి బ్రతికితేమి!

273

నరకలోకపు జాగిలాలు
హాస్పటల్స్ లో సంచరిస్తుంటే
పేదవాడు చస్తేమి బ్రతికితేమి
కాసుల లెక్కలే కావాలి వాటికి!

కరోనా నగరంలో నాట్యం చేస్తుంది
విరామమెరగక తిరుగుతుంది
కనపడలేదా వినపడలేదా
అసహాయుల హా హా కారాలు?
ఏలికల్లారా పీలికల్లారా..
నిరు పేదలు రోదనలతో
శ్వాస అందక చస్తుంటే
ఎంత దారుణం
ఎంత దారుణం?
కరోనా సోకి జరం వస్తె
దిగులు పడి కలత చెంది
వైద్య మందక మరణిస్తే
ఎంత కష్టం
ఎంత నష్టం
ఇటు చూస్తే ప్రవేట్ వైద్యం
అందని ద్రాక్ష
అటు చూస్తే గవర్నమెంట్ వైద్యం
నరక లోకపు శిక్ష!
వెర్రివాల్లారా.. పిచ్చివాల్లారా..
రాజకీయనాయకుల అక్రమాల
చక్రాల కింద నలిగిపోయే
దీనులారా హినులారా..
మీ బాధలు మీ గాథలు
వినేదెవరు కనే దెవ్వరు?
ఏలికల నాలికలు వేల చీలికలు
వరాల వర్షం కురిపించారని
కష్టాలకు కన్నీళ్లకు తావే ఉండదని
ఓటు వేస్తే
కరోనా కాటుకు కొన ఊపిరితో
కొట్టుకుంటుంటే కాపాడే నాయకుడెక్కడ?
కాస్టానికి సైతం ఖరీదు కట్టే లోకం
పేదలకు శాపమాయే
కడ చూపుకు నోచుకోని చావులాయే
కంటినిండా గంగ పొంగుడాయే
ప్రాణం లేని శిలలకు వందల వేల కోట్లు అక్కడ
ప్రాణమున్న మనుస్యులకు విలువ లేదు ఇక్కడ
తల్లి పోతే తండ్రి పోతే
గుక్క పట్టి ఏడ్చే పసి పిల్లలకు
దిక్కెవరు మొక్కు ఎవరు?
తెలంగాణలో తెల్లారని జీవితాలు
పాలకులకు పట్టవాయే
బ్రతుకంతా గాయమాయే
కాయాన్ని కాల్చడానికి
కాస్టాలే కరువాయే
ఎంత చిత్రం ఎంత చిత్రం
తెలంగాణ బ్రతుకు విచిత్రం?
– నారగోని ప్రవీణ్ కుమార్  ,
 సామాజిక కార్యకర్త,9849040195