పేద‌ల ఆక‌లి తీర్చ‌డంలో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం

241

– విజ‌య‌వాడ నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి

కొవిడ్ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో నిరాశ్రయులు ఆక‌లి తీర్చ‌డంలో స్వ‌చ్ఛంద సంస్థ‌ల కృషి అభినంద‌నీయం అని విజ‌య‌వాడ నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి  అన్నారు. గురువారం  పాత‌బ‌స్తీ ర‌థం సెంట‌ర్ స‌మీపంలో హ‌రే కృష్ణ మూవ్మెంట్ వారి అధ్వ‌ర్యంలో నిరాశ్రయులు భోజ‌న ప్యాకేట్లు పంపిణీ కార్య‌క్ర‌మంలో మేయ‌ర్ పాల్గొన్ని వారికి   భోజ‌న ప్యాకేట్లు అందించారు. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణాంగా వ‌ల‌స కార్మికులు, అనాధ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వారిని అదుకునేంద‌కు హ‌రే కృష్ణ మూవ్మెంట్ సంస్థ‌  భోజ‌నం ఏర్పాటు చేయ‌డం సంతోక‌ర విష‌యం అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హ‌రే కృష్ణ మూవ్మెంట్ నిర్వ‌హ‌కులు వంశ‌ధార‌దాసు త‌దిత‌రులు ఉన్నారు.