బీజేపీపై పెద్దిరెడ్డి తిరుగుబాటు

124

– ఈటల చేరికపై అసమ్మతి

సిద్ధాంతాపరమైన పార్టీ అని చెప్పుకొనే బీజేపీ… ఆరోపణలతో భర్త రఫ్ అయిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని మాజీ మంత్రి,  బిజెపి నేత ఇనగాల పెద్దిరెడ్డి పార్టీ అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.టీఆర్ ఎస్ పార్టీలోకి తనను ఎవరూ ఆహ్వానించలేదని తేల్చి చెప్పారు పెద్దిరెడ్డి. హుజూరాబాద్ లో ఉపఎన్నిక వస్తే తాను కచ్చితంగా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ లోకి వస్తున్న అంశంపై పార్టీ నేతలు ఎవరూ తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశానని గుర్తు చేశారు. తానేంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. ఆత్మాభిమానం చంపుకొని పార్టీ లో ఉండాల్సిన అవసరం ఏ నేతకు ఉండదని ఘాటుగా మాట్లాడారు. ఒక్క వర్గం వ్యక్తులు మాత్రమే ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు.ఆయనతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా నన్ను అడగకపోవడం శోచనీయం.ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులు నాకు చెప్పడానికి ఏంటి బాధ?హైదరాబాద్ లోని వివేక్ ఫామ్ హౌస్ లో చర్చలు జరిపితే కూడా నేను గుర్తు లేదా …నన్ను కాదని పార్టీ లోకి ఎలా తీసుకుంటారు?స్థానిక ప్రతినిధి ని అయిన నన్ను సంప్రదించకుండా ఎలా తీసుకుంటారు. అని సూటిగా ప్రశ్నించారు.  టీఆరెస్ పార్టీలోకి నన్ను ఎవరు ఆహ్వానించలేదు అని స్పష్టం చేశారు.