వీసీల నియామకాల్లో సామాజిక న్యాయం ఏది…?

120

పది మందిలో బీసీలకు రెండేనా..?
అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ బీసీలకు కులమే అనర్హతగా మారింది.
– జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు

సిద్దిపేట జిల్లా:  (చేర్యాల మండలం) గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మొద్దు నిద్ర నుండి లేచి పది మందితో యూనివర్సిటీ వీసీ పోస్టులను భర్తీ చేశామని గొప్ప చెప్పుకుంటున్న ప్రభుత్వం మాత్రం పూర్తిగా సామాజిక న్యాయం విస్మరించిందని,అనర్హులకు, కురువృద్ధులకు అగ్రవర్ణ కులాలకు పెద్ద పీఠవేసి,అరవై శాతం ఉన్న బీసీలకు కేవలం రెండు మాత్రమే కేటాయించి టీఆరెస్ ప్రభుత్వం బీసీలకు మళ్ళీ అన్యాయం చేస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ధ్వజమెత్తారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి డెబ్భై ఏళ్లు దాటిన కురువృద్ధులకు, పదవి విరమణ పొంది పది సంవత్సరాల నుండి విశ్రాంతి తీసుకుంటున్న వారికి గతంలో అనేక అవినీతి ఆరోపణలు, అడ్డగోలుగా నియమకాలు చేసిన అవినీతి పరులకు ,బంధుప్రీతి,కులప్రితితో వీసీ పోస్టుకు అనర్హతలు ఉన్నప్పటికీ అక్రమంగా కట్టబెట్టారని ,దేశవిదేశాల్లో అనేక సెమినార్లు నిర్వహించిన సమర్థులు ,ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా ఎన్నోమార్లు సెట్ పరీక్షలు నిర్వహించి ప్రిన్సిపాళ్లుగా ,రిజిస్టార్ లుగా పరిపాలన దక్షత ఉన్నప్పటికీ, వీసిల ఎంపికలో బీసీలకు కులమే అనర్హత గా మారిందని ఆరోపించారు. టీఆరెస్ ప్రభుత్వం ప్రభుత్వ నియామకాల్లో మళ్ళీ మళ్ళీ అన్యాయం చేస్తుందని,మొన్న జరిగిన టిఎస్పీఎస్ నియామకాల్లో ,నేడు జరిగిన యూనివర్సిటీ వీసీల నిమామకాల్లో బీసీల కు అన్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి పేషీలో రాజకీయ సలహాదారులు బీసీలు లేకపోవడం మూలంగా ఇలాంటి బీసీ వ్యతిరేక నిర్ణయాలు వస్తు