ఓటుకు కోట్లు కేసులో బాబును వదిలేస్తే చట్టం, రాజ్యాంగంపై నమ్మకం పోతుంది

468

– ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును విచారణకు కూడా పిలవలేదంటే.. వ్యవస్థల మీద నమ్మకం ఎక్కడ ఉంటుంది..?
– రేవంత్ రెడ్డి పై ఈడీ చార్జిషీట్ వేస్తే చంద్రబాబు ఎందుకు నోరు మెదపడంలేదు..?
– ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డి వెనుక ఉన్న కర్త, కర్మ, క్రియ చంద్రబాబే
– 2015లో తెలంగాణ ప్రభుత్వం ఛీ కొడితే.. 2019లో ఏపీ ప్రజలు బాబును ఛీ కొట్టారు
– పార్టీ వ్యవస్థాపకుడి చావుకు కారణమై, ఆయన జన్మదినం నాడు మహానాడు డ్రామా ఆడితే ఎవరు నమ్ముతారు?
– తెలుగు ప్రజలకు పట్టిన చీడ-పీడ చంద్రబాబు
– వరుస ఓటముల తర్వాత కూడా ఎందుకీ గంటల తరబడి చంద్రబాబు సుత్తి కార్యక్రమాలు..?
– గంటల తరబడి మాట్లాడకపోతే అనారోగ్యం వస్తుందని డాక్టర్లు సలహా ఏమైనా ఇచ్చారా బాబూ..?
– ప్రభుత్వం రెండేళ్ల విజయాలను మరుగునపర్చాలన్న ఏకైక కోరికతోనే 2 రోజులు మహానాడు డ్రామా
–  వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి జోగి రమేష్ 

1. ఓటుకు కోట్లు కేసులో ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. 2015 మే 31న ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు, కట్టుబట్టలతో తనను ఎక్కడ అరెస్టు చేసి జైల్లో పెడతారన్న భయంతో హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రి విజయవాడ పారిపోయి వచ్చాడు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ మీద హక్కులు వదులుకున్నాడు.
– ఈ కేసులో చార్జిషీట్ మీద నోరెత్తకుండా, మహానాడు పేరుతో జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి, గంటల తరబడి ప్రభుత్వంపైన దుమ్మెత్తిపోస్తే ప్రజలు నమ్మరు. ప్రజాపక్షంగా పరిపాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డిగారి పక్షాన ప్రజలు ఉన్నారు. తెలుగు జాతికి దండగ మహానాడు.. తెలుగు ప్రజలకు పట్టిన చీడ, పీడ చంద్రబాబు.
2. దొరికిపోయిన దొంగలా.. హైదరాబాద్ నుంచి ఏపీకి పారిపోయి వచ్చి అదేదో.. భజన కోసం చేసే ఘన కార్యక్రమం కింద  చూపించి.. ఇక్కడ బినామీ భూములు కొని లేని అమరావతి గ్రాఫిక్స్‌లో చూపించి.. 2019లో ప్రజలు ఛీ కొట్టే సరికి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇక్కడ అమరావతి రాజధాని పేరుతో అధికారంలో ఉన్న 5 ఏళ్ళూ గ్రాఫిక్స్ తో కాలం గడుపుతూ, విఠలాచార్య డైరెక్షన్ ను మించిపోయే విధంగా సెట్టింగులు వేసి, సినిమా డైరెక్టర్లను తెచ్చి, అహో అమరావతి… ఓహో అమరావతి అని ఎన్ని వేషాలు వేసినా.. 2019 ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు పారిపోయాడు.
– 2015లో తెలంగాణ ప్రభుత్వం ఛీ కొడితే.. 2019లో ఏపీ ప్రజలు ఛీ కొట్టారు. ఇంత స్పష్టంగా 2019లో ఛీ కొట్టిన తర్వాత కూడా కుక్కతోక వంకర అన్నట్లుగా బాబు బుద్ధి మారలేదు.
– హైదరాబాద్ లో ఓటుకు కోట్లు కేసు తనపై వస్తే ఇక్కడకు వచ్చాడు. ఇక్కడ ప్రజలు  చిత్తు చిత్తుగా ఓడించిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాడు.
– ఇంత జరిగినా తనలో ఏమాత్రం మార్పు రాకుండా, పశ్చాత్తాపం అనేదే లేకుండా, అవే కుట్ర రాజకీయాలతో, కులాలను, మతాల మధ్య చిచ్చుపెడుతూ, మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఈ ప్రభుత్వం మీద అనేక కుట్రలు చేస్తున్నాడు.
3. భారత న్యాయ వ్యవస్థ మీద, ఐపీసీ మీద, సీఆర్‌పీసీ మీద, ఎవిడెన్స్ యాక్ట్ మీద ఇండియాలో ప్రజలకు నమ్మకం ఉండాలంటే ఓటుకు కోట్లు కేసులో తెరవెనుక నుంచి నడిపించిన బాబును ఇప్పటికైనా అరెస్ట్ చేయాలి. కనీసం విచారణకు కూడా పిలిపించకుండా చంద్రబాబును వదిలేస్తే.. ఈ దేశంలో వ్యవస్థలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో అర్థంకాని పరిస్థితి ఉంటుంది.
4. ఇక ఈరోజు బాబు జాతీయ అధ్యక్షుడుగా మాట్లాడారా? లేక అంతర్జాతీయ అధ్యక్షుడుగా మాట్లాడారా? చంద్రబాబుకు తెలంగాణలో ఏముంది? సొంత ఇల్లు, సొంత ఆస్తులు, సొంత కంపెనీలు, సొంత బినామీలు, సొంత ఎల్లో మీడియా తప్ప ఏ ప్రజలు బాబు వెనుక ఉన్నారు.
5. గత 14 నెలలుగా కరోనా మహమ్మారి తరుముకొస్తున్నా.. వివిధ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు డీబీటీ ద్వారా బటన్ నొక్కి ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇంత గొప్పగా పరిపాలన చేస్తుంటే.. వ్యవస్థల్లో జొరబడి, తన వాళ్ళను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి పైన చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశాడు.
– తన అనుంగ శిష్యుడు రేవంత్ రెడ్డిపై ఈడీ చార్జిషీట్ వేస్తే.. మహానాడు జూమ్ మీటింగ్ లో ఉదయం నుంచి చెప్పిందే చెబుతూ సుత్తి కొడుతున్న చంద్రబాబు దానిపై కనీసం ఒక్క మాట అయినా ఎందుకు మాట్లాడలేకపోయాడు..?
– ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును కనీసం విచారణకు కూడా పిలవలేదంటే.. వ్యవస్థల మీద ఇక ఎక్కడ నమ్మకం ఉంటుంది..?
– మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ.. అని చంద్రబాబు మాట్లాడిన ఆడియోలు, వీడియోలు ప్రపంచం అంతా చూశాక.. అది చంద్రబాబు స్వరమే అని ఫోరెన్సిక్ ల్యాబ్ లు నిర్థారించినా, ఆయన్ను విచారణకు కూడా పిలవకపోతే.. వ్యవస్థల మీద ఇక నమ్మకం ఎక్కడ ఉంటుంది..?
6. ఐక్య రాజ్య సమితిలో మాదిరి మనిషి వెనుక పెద్ద పెద్ద జెండాలు పెట్టారు. ఉన్నది ముగ్గురు ఎంపీలు. జెండాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి.  ముగ్గురు ఎంపీలు ఉన్న పార్టీ మహానాడు పేరుతో జూమ్ మీటింగ్ పెట్టి ఉదయం నుంచి చంద్రబాబు గంటలకొద్దీ సుత్తి కొడుతున్నాడు. మధ్య మధ్యలో ఆయన భార్య ఇచ్చిన హెరిటేజ్ మజ్జిగ తాగుతూ..  కుర్చీ వదలకుండా గంటల తరబడి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. రోజుకు కొన్ని గంటలు మాట్లాడకపోతే ఆయనకు అనారోగ్యం వస్తుందని ఎవరన్నా డాక్టర్లు సలహా ఇచ్చారేమో తెలియాలి.
5. ఓటుకు కోట్లు కేసులో కర్త, కర్మ, క్రియ.. రేవంత్ రెడ్డి వెనక సూత్రధారి, పాత్రధారి నారా చంద్రబాబు నాయుడే అని తెలుగు ప్రజలకు తెలుసు.
– ఇంతకీ డబ్బు రేవంత్‌ది కాదని బాబుది మాత్రమేనని అందరికీ తెల్సినా బాబును ఎందుకు అరెస్ట్ చేయటం లేదు.
– చంద్రబాబు పంపితేనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి పై ఈడీ చార్జిషీట్ వేస్తే ఎందుకు నోరు తెరవడు.. ఎందుకు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పడు..?
– అసలు ఓటుకు కోట్లు కేసు మీద చంద్రబాబు ఎందుకు మాట్లాడరు? పంచాయితీ ఎన్నికల నుంచి తిరుపతి ఉప ఎన్నిక వరకు అన్నీ ఓడిపోయి కూడా రోజూ ఎందుకీ గంటల తరబడి సుత్తి కార్యక్రమాలు..?
– పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ పై మన హక్కును లేకుండా చేసింది చంద్రబాబే. దీనివల్ల ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో సెటిల్ అయిన లక్షల మంది మన ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, ఆంధ్రప్రాంత ప్రజలు ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడుతున్నారు.
6. పార్టీ లేదు, బొక్కా లేదు, ఈ పార్టీ మునిగిపోయే పార్టీ అని చెప్పిన అచ్చెన్నాయుడుని ఒక పక్కన.. లోకం జ్ఞానం లేని, తా అంటే తూ రాని రాజకీయ అజ్ఞాని తన కొడుకు లోకేష్ ను మరోపక్కన పెట్టుకుని, ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన మరో పది మందిని జూమ్ కాన్ఫరెన్స్ లో పెట్టి మహానాడు పేరుతో డ్రామా ప్రదర్శించారు.
-ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద అబద్ధాలు, అసత్యాలతో కూడిన విమర్శలు, నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారు. కరోనా వస్తే హైదరాబాద్ పారిపోయి అక్కడే తలదాచుకుంటున్నచంద్రబాబు, స్వార్థ రాజకీయాల కోసం ఈ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాడు.
– పార్టీ వ్యవస్థాపకుడ్ని పైకి పంపేసి, ఆయన జన్మదినం నాడు మహానాడు అంటూ డ్రామా ఆడుతున్న పార్టీ ప్రపంచ చరిత్రలో ఇంకొకటి ఉంటుదా?
7. గడియారం ముల్లు తిరుగుతూ ఉంటుందని ప్రపంచంలో ఎవరికీ తెలియని సత్యాన్ని, తానే కొత్తగా కనిపెట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ప్రతి ఇంట్లో ఫ్యాన్ తిరిగినట్టు గడియారం ముల్లు కూడా తిరుగుతూనే ఉంటుంది.  పంచర్ పడిన టీడీపీ సైకిల్ మాదిరిగా మూలన పడేయరు.
– రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల విజయాలు మరుగుపర్చాలన్న ఏకైక కోరికతో రెండు రోజులు మహానాడు అంటూ పెట్టారు.
– అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ కాలంలో, కరోనా కల్లోలంలోనూ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రజలకు అండగా నేను ఉన్నాను.. అని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ, పేద, మధ్యతరగతి వర్గాలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారు.  ఈరోజున జగన్ మోహన్ రెడ్డిగారిని మా అన్న, మా తమ్ముడు, మా మేనమామ అని రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు.
8. ప్రజల్లో లేనటువంటి తెలుగుదేశం పార్టీ తరుపున ప్రగల్భాలు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి.  లేనిపోని భారీ డైలాగులు చెప్పటం ఇంతకు ఇంత వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం అని డైలాగులు కొట్టడం చూస్తుంటే చేతగాని వాడికి కోపమెక్కువ అనే సామెత గుర్తుకు వస్తోంది తప్ప మానం, మర్యాద ఉన్నవాళ్ల భాష కాదు.
9 . ఇక జూమ్ లో పుట్టి, జూమ్ లో పెరిగి, జూమ్ లోనే కలిసిపోతున్న తెలుగుదేశం పార్టీ 2024 వరకు. ఆ తర్వాత కూడా ఇలాగే జూమ్ లో ఏటా మహానాడులు పెట్టుకోవాలని, ఉన్న పది మందిని పోగుచేసుకుని సొల్లు, సుత్తి చెప్పుకుంటూ జూమ్ తెలుగుదేశంగా దినదినాభివృద్ధి చెందాలని భావిస్తున్నాం.
– మీరు ఎన్ని తిట్టినా ప్రజల ఆశీస్సులు, ప్రజల దీవెనలు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నాయి. మనసున్న, విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఈరోజు ప్రజలు అండగా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డిమరో 20 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు.
– చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా విష ప్రచారం చేసినా, మతాల పేరుతో రథ యాత్రలు చేసినా, వ్యవస్థలను మేనేజ్ చేసినా… అలాంటి నాయకుడిని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఛీత్కరించుకుంటూనే ఉంటారు. ప్రజలు ఛీ పో.. అని అంటూనే ఉంటారు.