తెలంగాణాలో ప్రజారోగ్యం పై ప్రభుత్వ నిర్లక్ష్యం

324
చంద్రబాబునాయుడు, టిడిపి జాతీయ అధ్యక్షుడు
తెలంగాణలో ప్రజారోగ్యం పడకేసిందని, తెలుగుదేశం హయాంలో హైదరాబాద్‌ను హెల్త్ హబ్‌గా మార్చామని టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మహానాడు సందర్భంగా ఆయన తెలంగాణలో ప్రజారోగ్య అంశంపై మాట్లాడారు.
తెలంగాణాలో వైద్య సదుపాయాలను మెరుగుపర్చేందుకు నిర్మాణాత్మకంగా కృషిచేశాం. గాంధీ ఆసుపత్రిని యుద్దప్రాతిపదికన నిర్మించాం. నిజామ్ ఆసుపత్రిని ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. గాంధీ, ఉస్మానియాలను అభివృద్ధి చేశాం. హెల్త్ టూరిజం ను ప్రోత్సహించాం, దానివల్ల పెద్దఎత్తున ఆసుపత్రులు వచ్చాయి. ఈరోజు క్లిష్ట సమయంలో పేదప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై ముందుకు సాగాలి అన్నారు.  మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, పార్టీ నాయకుడు గండ్రోతు శ్రీనివాసరావు, కూరపాటి వెంకటేశ్వర్లు బలపర్చారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీర్మానాన్ని ఆమోదించారు.

ప్రజారోగ్యం పడకవేసింది:  కాట్రగడ్డ ప్రసూన, మాజీ ఎమ్మెల్యే : 
తెలగాంగాణాలో ప్రజారోగ్యం పడకవేసింది. కరోనా మహమ్మారికి అనే సంసారాలు బలవుతున్నాయి. ఆర్థికంగా సంసారాలు చితికిపోతున్నాయి. కేంద్రం, రాష్ట్రాలు ప్రజారోగ్యం, విద్యను గురించి పట్టించుకోవాలి. తెలంగాణాలో నెలకొన్న పరిస్థితులపై సిగ్గుపడుతున్నాం, ప్రజారోగ్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. తెలుగుదేశం హయాంలో గాంధీ ఆసుపత్రిలో 1700 పడకలతో అభివృద్ధి చేశాం. అక్కడ ఇప్పడు 43వేలమంధికి చికిత్స చేస్తున్నారు. నాడు నిర్మించిన గచ్చిబౌలి స్టేడియం అతిధిగృహాన్ని టిమ్స్ గా మార్చడంతో 2,300మంది కరోనా రోగులకు సేవలందుతున్నాయి. ఇది చంద్రబాబు భిక్షే. కోటిలో 300పడకలతో వైద్యం అందిస్తున్నారు. ఇఎన్ టి, ఇఎస్ఐ, జార్జి ఆసుపత్రిని పునరుద్దరించిన ఘనత చంద్రబాబుదే. నాడు చంద్రబాబు సేవల గురించి తెలంగాణా గర్విస్తోంది. నేడు లాక్డౌన్ తో అర్థాకలితో అలమటిస్తున్నా కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల బిల్లులు వేస్తూ దోచుకుంటున్నారు. ఒక ఆసుపత్రిలో కరోనా చికిత్సకు 74లక్షల బిల్లు వేశారు. గర్భణీ ఆసుపత్రిలో బెడ్ దొరక్క చనిపోతే అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదు. 108 వాహనం వద్దే మరో గర్బణీ స్త్రీ మృతిచెందింది. తెలంగాణాలో చంద్రబాబుమాత్రమే సౌకర్యాలు అందించగలిగారు. నేడు ఇక్కడ అస్తవ్యస్థంగా తయారుచేశారు. ఎంజిఎం ఆసుపత్రి విషయంలో చంద్రబాబు చూపిన  చొరవ ఇప్పుడు ఉపయోగపడుతోంది. గతంలో కరోనాతో 7శాతం ప్రజలు  ఆసుపత్రికి వెళ్తుంటే ఇప్పుడు 17శాతం ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఎక్కడా పారిశుద్ధం లేదు, ఒకే బాత్రూమ్ 30మంది వాడుతున్నారు. భాగ్యనగరాన్ని అభాగ్య నగరంగా మారుస్తున్నారు. ప్రైవేటు టీచర్లు ఉద్యోగాల్లేక కాటికాపరులా మారుతున్నారు. చంద్రబాబు అధికారం ఉంటే మా బాగోగులు చూసుకునే వారని అనుకుంటున్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు రావాలి. తెలంగాణాలో మెరుగైన వైద్యసౌకర్యాలపై దృష్టిపెట్టాలి.

గండ్రోతు శ్రీనివాసరావు, తెలంగాణా తెలుగుదేశం నాయకుడు
కరోనా విషయంలో కెసిఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కరోనాను పక్కనబెట్టి ఎన్నికలకు వెళ్లి వ్యాప్తికి కారణమయ్యారు. ఆరోగ్యశాఖ కెసిఆర్ వద్దనే పెట్టుకొని పట్టించుకోకుండా వదిలివేశారు. ప్రజలను గాలికొదిలి సిఎం ఫాం హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు లేక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే నిలువుదోపిడీ చేస్తున్నారు. కరోనా కట్టడి విషయంలో తెలంగాణా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. భయపడి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హైకోర్టు మొట్టికాయలు వేస్తే రాత్రికి రాత్రికి కర్ఫ్యూ విధించారు. ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉచితంగా వైద్యం అందించాలి. ఎంతోమంది ఉద్యోగులు చనిపోయారు, వారి కుటుంబాలకు ఉద్యోగాలివ్వాలి. కరోనాతో మరణించిన కుటుంబాలకు 10లక్షలు పరిహారం ఇవ్వాలి.

కూరపాటి వెంకటేశ్వర్లు, తెలంగాణా తెలుగుదేశం నేత
టిఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగంలో పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు పాలనలో కట్టిన ఆసుపత్రులు తప్ప కొత్తవి లేవు. ఆసుపత్రుల్లో ఖాళీలు భర్తీ చేయలేదు, ప్రజారోగ్యంపై దృష్టిపెట్టలేదు. ఆరోగ్య హెల్త్ బులిటిన్లో తప్పుడు లెక్కలతో చూపుతున్నారు. హైకోర్టు కూడా ఈ విషయంలో మొట్టికాయలు వేసింది. సకాలంలో స్పందించకపోవడంతో బలహీనవర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. కరోనా వైద్యసేవల విషయంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణా వెనుకబడి ఉంది. రెమ్డి సివిర్ బ్లాక్ లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అమాయకులైన పేదలను ప్రైవేటు ఆసుపత్రులు దోచుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. గత 20రోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కేసులు ఎక్కువవుతున్నాయి. కరోనా కేసులు 80శాతం పెరుగుతాయని పరిశోధనసంస్థలు హెచ్చరిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన అవసరమైన రోగులకు సేవలు అందిస్తున్నాం.తెలంగాణాలో కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి సేవలందించాలని కోరుతున్నాం.