ప్రజల కోసం ప్రగతి భవన్ ను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చిన మాజీ ఎం.పి

442

కోవిడ్ పేషెంట్ల‌కు ఉచిత వైద్యం, ఉచిత ఆక్సిజ‌న్, ఉచిత భోజ‌న స‌దుపాయం
అందుబాటులో 24గంట‌లూ వైద్య సిబ్బంది.
చేవెళ్ల ప్ర‌జ‌ల‌కోసం ఉచిత కోవిడ్ కేర్ సెంట‌ర్ ప్రారంభం

చేవెళ్ల లోని చేవెళ్ల ప్ర‌గ‌తి భ‌వ‌న్ (యూత్ క్ల‌బ్ ) ను కోవిడ్ కేర్ సెంట‌ర్ గా మార్చారు. 10 బెడ్లు, 10 ఆక్సిజ‌న్ కాన్స‌ట్రేట‌ర్ల స‌పోర్ట్, ఉచిత వైద్యం, ఉచిత భోజ‌నం, 24గంట‌లూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా దీన్ని రూపొందించారు. ఈ తాత్కాలిక కోవిడ్ కేర్ సెంట‌ర్ ను స్థానిక నాయ‌కుల‌తో క‌ల‌సి చేవెళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ప్రారంభించారు. జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ (JKMR) ఆధ్వర్యంలో చేవెళ్ల ప్రగతి భవన్ (యూత్ క్లబ్) ను  కోవిడ్ బారిన పడిన పేద ప్రజల కోసం 24×7 డాక్టర్ల పర్యవేక్షణలో ఉండే తాత్కాలిక కేర్ సెంటర్ గా మార్చిన‌ట్లు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి తెలిపారు.. 10 బెడ్స్, 10 ఆక్సీజన్ కాన్సంట్రేటర్స్ సపోర్ట్ తో అందుబాటులో ఉంటాయి. కరోనా పాజిటివ్ వచ్చిన వారు, తక్కువ లక్షణాలు (mild symptoms) ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు వైద్యం అందించేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశామ‌నీ, దీన్ని చేవెళ్ల తో పాటు చుట్టు ప్ర‌క్క‌ల గ్రామాల్లో కొవిడ్ పాజిటివ్ వ‌చ్చి ఇబ్బంది ప‌డుతున్న వారు వినియోగించుకోవాలిని ఆయ‌న కోరారు.

 ఈ సెంట‌ర్ లో పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 10 కి మించి పెరిగితే అవస‌ర‌మైతే మ‌రో సెంట‌ర్ ను ఇలాంటిది ప్రారంభిస్తామ‌ని కొండా చెప్పారు. ఇప్ప‌టికే JKMR పౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో చేవెళ్లి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గ్రామాల్లో శానిటేజ‌ష‌న్ చేస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సెంట‌ర్ కు వ‌చ్చిన పేషెంట్లు ఎవ్వ‌రూ కూడా ఒక్క రూపాయి చెల్లించ‌న‌వ‌స‌రంలేద‌నీ,  పేషెంట్లు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వెళ్లాల‌ని తాను కోరుకుంటున్నానీ, వ్యాధి తీవ్ర‌త ఎక్క‌వైతే పెద్ద ఆసుప‌త్రుల‌కు పంపిస్తామ‌ని కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి వెల్ల‌డించారు.
కొవిడ్ పాజిటివ్ వ‌చ్చి అక్సిజ‌న్ లెవ‌ల్స్ 92 కంటే త‌క్కువ ఉంటే త‌మ సెంట‌ర్ లో తీసుకోమ‌నీ, 92 కంటే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ఉండీ,  శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డుతున్న‌వారు, ద‌గ్గు, ఆయాసం, జ‌లుపు, వాంతులు, విరేచ‌నాలతో బాధ‌ప‌డుతున్న‌వారిని ఈ సెంట‌ర్ లో చేర్చుకుంటామ‌ని సెంట‌ర్ ఇన్చార్జ్ డాక్ట‌ర్ అనుష తెలిపారు. ఈ సెంట‌ర్ లో అడ్మిష‌న్ కావాల‌నుకునేవారు  RTPCR లేదా RATR పాజిటివ్  రిపోర్ట్ , ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీతో రావాలనీ,ఐసియు అందుబాటులో లేదు కాబ‌ట్టి ఇక్క‌డ క్రిటిక‌ల్ పేషంట్ల ను తీసుకోమ‌ని, ఇది ICU కాదు కాబట్టి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు ఇక్కడ చేర్చుకోవడం వీలు కాదని డాక్ట‌ర్ అనూష‌ పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చేవేళ్ల‌ స‌ర్పంచ్ శైల‌జ ఆగిరెడ్డి, ఎంపిటిసి సున్న‌పు వ‌సంతం, స్థానిక నాయ‌కులు పాల్గుట్ట జ‌నార్ధ‌న్ రెడ్డి, అంత‌రాం వీరేంద‌ర్ రెడ్డి, దేవునిఎర్ర‌వ‌ల్లి స‌ర్పంచ్ మాణిక్ రెడ్డితోపాటు యూత్ క్ల‌బ్ స‌భ్యులు పాల్గొన్నారు.