డాక్టర్లూ…ఇప్పుడు మాట్లాడండి!

324

ప్రపంచంలో ఏ రోగి అయినా తనకు ఉన్నటువంటి శారీరిక రుగ్మతని నిర్మూలిచుకోడానికి తనకి  స్థోమత లేకపోయినా  అలవిగాని అప్పులు  చేస్తూ‌,  ఉన్నటువంటి ఆస్తులని కూడా అమ్ముకుంటారు.
ఒక్క ముఖ్యవిషయం అందరూ గమనిస్తే అందరికీ మంచిది … , రోగులకి  ఏఏ మందులు ఇచ్చారు ?  ఎవరు ఇచ్చారు ? వాటిలో ఏమి ఉన్నాయి ? అని ఎవ్వరూ చూడరు. ఏ విధానమైనా వారికి కావలసింది ఒక్కటే.. … అంటే ఎల్లోపతి, ఆయుర్వేదం, యునాని, హోమియో, పసరు వైద్యం, చెట్ల వైద్యం,  పుట్ట వైద్యం, బాబాల వీఫూదీ‌, తాయత్తులు, తాతయ్యల బామ్మల చిట్కా వైద్యం , మంత్రాలు , తంత్రాలు, యంత్రాలు, పూజలు , జపాలు, వగైరాలు ఎన్ని ఉన్నా , … ఏదో ఒకదాని వల్ల తగ్గితేనే సంతోషంతో ఉంటారు. ఆ రుగ్మతని తగ్గించుకునేందుకు అందరూ వారినే ఆశ్రయిస్తారు. అది ఎవరు కాదన్నా చాలా సహజం. నిజం.
కరోనా విషయంలో కూడా ఇదే జరుగుతోంది.  జరిగింది. మూర్ఖంగా  ఎల్లోపతి వైద్యులంతా వైద్య విధానాలపైన యధ్ధం  చేస్తున్నట్లుగా జరుపుతున్నట్టుగా కనబడుతోంది. అదేవిధంగా అందుకోసం వారు, ప్రభుత్వాలు, అధికారులు , రాజకీయ నాయకులు కలసికట్టుగా  స్వార్ధంతో డబ్బుకోసం కక్కుర్తిపడి లాలూచీ పడినట్టుగా  వ్యాపారం చేస్తున్నట్లుగా ప్రజలకు  కనిపిస్తోంది. అదే విషయంలో ప్రజలు అందరూ దేశమంతా ఎదురు తిరుగుతున్నారు.

ఇది చాలా ప్రమాదకరం. భవిష్యత్తులో ప్రజలంతా … ప్రభుత్వాల విధానాలపై,  ప్రభుత్వాలపైన,  రాజకీయ నాయకులపై ఎదురు తిరగలేక ఎల్లోపతి విధానాలపై వ్యతిరేకంగా కార్పరేట్ నర్సింగ్ ఆసుపత్రులపై దాడులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు సెక్యూరిటీ సిబ్బందిని భారీగా పెంచుకుంటే,  అప్పుడు ప్రజలు డాక్టర్లపైన , అక్కడి ఉద్యోగులపైన, నర్సులపైన వ్యక్తిగత దాడులు చేయడానికి సంసిద్ధం అయితే  దేశంలోని రోగుల పరిస్థితి ఏంటి ?

ఇటువంటి పరిస్థితుల్లో  అన్యమతస్తులు, ఆ  రాజకీయ నాయకులు కలసి,  కావాలనే  మతమార్పిడి  కార్యక్రమాల కోసమే వైద్యవిదానాలని, పనిచేసే మందులని  ఒప్పుకోక,  తాత్సారం చేస్తున్నారు అనే అపవాదుకూడా భరించవలసి వస్తుంది. ఇది మత కలహాలకి కూడా దారి తీసే ప్రమాదం ఉంది.  ప్రభుత్వాలు ఇంకా సాగదీస్తే మంచిది కాదు.

ప్రజలలో కసిపెరిగిన ఇంకొందరు ఏమంటున్నారంటే…  
ఆ దేముడి దయవలన అందరు రాజకీయ నాయకులకి,  ఉన్నతాధికారులకి, డాక్టర్లకి, ప్రభుత్వ సిబ్బందికి కరోన రోగం  అంటుకుని, మందులులేక, డబ్బులు అందక, ఆక్సిజన్ లేక, బెడ్లు లేక ప్రాణభయంతో వాళ్ళూ వాళ్ళ కుటుంబీకులంతా రోడ్డునపడి నానా కష్టాలను అనుభవించాలని అంటున్నారు. ఇది ఎంత ప్రమాదమో మీకు తెలుస్తోందా ?
ఇవన్నీ గమనిస్తుంటే నెల్లూరు పసరు వైద్యం అనబడే పసరు వైద్యాన్ని, దాని విధానాన్ని ప్రభుత్వాలు‌, రాజకీయ నాయకులు, అధికారులు  ఇంకా  అలసత్వం చేయడం, ఆలస్యం‌ చేయడం ఏమాత్రం మంచిదికాదు. ప్రజలని కాపాడండి.

– T.S.Malleswara Prasad.
                                                                                                        Chairman.
                                                                                                    Bharathiya Vajra Party.
                                                                                                       Cell : 9030362942.