ఎన్టీఆర్ దూరదృష్టితోనే ఎదిగిన క్యాన్సర్ ఆసుపత్రి: బాలకృష్ణ

228

తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 99 వ జయంతి ఉత్సవాలను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో ఘనంగా నిర్వహించారు. లక్షలాది క్యాన్సర్ రోగులకు ఆశాకిరణంగా నిల్చిన సంస్థ వ్యవస్థాపకులు కూడా అయిన  యన్ టి ఆర్ జన్మ దినోత్సవ వేడుకలు  నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ పాల్గొన్నారు.
ముందుగా సంస్థ ఆవరణలో ఉన్న స్వర్గీయ నందమూరి బసవతారక రామారావు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించిన  నందమూరి బాలకృష్ణ అనంతరం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా పేషెంట్లతో ముచ్చటించిన  నందమూరి బాలకృష్ణ వారి బాగోగులకు అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్స అందుబాటైన ధరలలో పేదలకు కూడా అందించాలనే లక్ష్యంతో స్వర్గీయ యన్ టి ఆర్ స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు.  భవిష్యత్తులో ఎన్నో మైలు రాయిలకు అధిగమించి సంస్థ ముందుకు వెళుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ హాస్పిటల్ స్థాపించడంలో స్వర్గీయ యన్ టి ఆర్ పోషించిన పాత్ర, ఆయన దూరదృష్టి నేడు దేశంలోనే అగ్రగామి క్యాన్సర్ చికిత్సా కేంద్రంగా ఎదిగిందని అన్నారు.

అంతకు ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీరంగంలో పని చేసిన తీరు, ఆ సందర్భంగా అందరినీ కలుపుకొని ప్రకృతి వైపరీత్యాలు, ఆపదలు తలెత్తిన సమయాలలో తెలుగురాష్ట్రాల ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకొన్నారు.  ప్రజల రుణం తీర్చుకోవడానికి, వారిని భాగస్వాములుగా చేసి తెలుగుదేశం పార్టీ నెలకొల్పి పేదల కోసం ఎన్నో మంచి పనులు చేసిన ఘనత స్వర్గీయ తారక రామారావు కు దక్కుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణతో పాటూ పాటు జెయస్ ఆర్ ప్రసాద్, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RIచ డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI;  జి రవి కుమార్, COO, BIACH&RI; డా. కల్పనా రఘునాధ్, అసోసియేట్ డైరెక్టర్, BIACH&RI; డా. కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI తదితరులు పాల్గొని సంస్థ వ్యవస్థాపకునికి ఘనంగా అంజలి ఘటించారు.