తెలంగాణలో 93శాతం రికవరీ

214

హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో  3,614 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4 శాతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాజాగా 3,961 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 93 శాతం, మరణాల రేటు 0.5 శాతంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వేలో 17 వేలకుపైగా బృందాలు పాల్గొన్నాయని ఆయన అన్నారు. ఆరోగ్య బృందాలు ఇప్పటి వరకు 6 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే చేసినట్లు వెల్లడించారు. కొవిడ్‌ ఓపీలో 11,814 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని, ఇప్పటివరకు 64 ప్రైవేటు ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. వీటిని పరిశీలించి షోకాజ్‌ నోటీసులు ఇచ్చామన్నారు. ఆయా ఆస్పత్రులు 24  నుంచి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని శ్రీనివాసరావు ఆదేశించారు.