10వ తరగతి పరీక్షలు వాయిదా

454

విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు
 ఆరోగ్య భద్రత కోసం వాయిదా.

రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా ఉదృతి తగ్గని కారణంగా పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందని, కరోనా తగ్గుముఖం పట్టాక మళ్ళీ సమీక్షించుకుని త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని అన్నారు.

మంత్రి సురేష్ విలేకరులతో మాట్లాడుతూ…..
విద్యార్థుల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు నిర్వహించాలని భావించాం. ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరం. పరీక్షలు రద్దు చేయవద్దని జరపాలని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు కోరారు.
కరోనా తగ్గుముఖం పట్టని కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని సిఎం 10 వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారు. కరోనా పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పరీక్షల నిర్వహణ పై నిర్ణయం తీసుకుని త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తాం.
విద్యార్థులు నష్ట పోకుండా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నాం. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా క్లాసులు ఉంటాయి. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు కూడా స్కూల్స్ కి రావాల్సిన అవసరం లేదు. పలువురు ఉపాధ్యాయులు కరోనా కు ప్రాణాలు కోల్పోయారు. వారికి సంతాపం తెలుపుతున్నాం.
 లోకేష్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఘాటు వ్యాఖ్యలు……
పరీక్షలు అనేవి విద్యార్థుల భవిష్యత్తుకు సంభందించిన విషయం. ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదని, దీనిని లోకేష్ ఎందుకు ఎంచుకున్నాడని మంత్రి సురేష్ అన్నారు. మీకు అంశాలు కావాలంటే విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఎలా పాఠశాలలకు చేరుస్తారని అడగండి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇన్ని విద్యా పధకాలు ఎలా అమలు చేస్తున్నారని అడగండి. నాడు నేడు పనులు మొదటి విడత ముగిసాయి రెండో విడత ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించండి. అంతే కానీ పిల్లల భవిష్యత్తు ను కాలరాయాలనే ఉద్దేశం తో పరీక్షలు రద్దు చేయాలనే లోకేష్ ను ఏమనాలని మంత్రి అన్నారు.
విద్యార్థులు పరీక్షలు రాసి ప్రతిభావంతులు ఆయితే టీడీపీకి ఓట్లు వేయరు అని లోకేష్ భయం.పరీక్షలు రాయకుండా అడ్డుకుంటే భవిష్యత్తు లో ఓట్లు వేస్తారు అనుకుంటున్నారేమో. అందరూ పరీక్షలు నిర్వహించాలని కోరుతుంటే రద్దు చేయాలని లోకేష్ కోరడం హాస్యాస్పదం యువతకు లోకేష్ ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో తెలుసు
ఆయన పరీక్షలను రాజకీయం చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ రాజకీయ విషయం కాదు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ కు సంబందించిన అంశం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తాం. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిత్యం ఆలోచించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తల్లిదండ్రులు కూడా విశ్వశించారు.