అర్చకులు, పాస్టర్ల్, ఇమామ్ లకు నిత్యావసర సరుకుల పంపిణీ

339

గుంటూరు: స్థానిక బ్రాడీపేట 4/9లోని “బ్రాహ్మణ చైతన్య వేదిక” రాష్ట్ర కార్యాలయంలో 26-5-21 బుధవారం ఉదయం ప్రవేట్ దేవాలయాలలో పనిచేసే పేద బ్రాహ్మణ అర్చకులకు, చిన్న చర్చి లలో పనిచేస్తున్న పాస్టర్లకు, చిన్న మసీద్ లలో పనిచేసే ఇమామ్, మౌజద్ లకు  రాష్ట్ర కార్యాలయంలో నిత్యావసర సరుకులను బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ  ఆధ్వర్యంలో కొప్పనూర్ చౌడేశ్వర రావు, కళావతమ్మ గార్ల జ్ఞాపకార్థం బ్రాహ్మణ,క్రిస్టియన్, ముస్లిం ప్రార్ధనాలయాల కుటుంబాలకు అందచేశారు. ఈ సందర్భంగా సిరిపురపు శ్రీధర్, కర్రా హోనక్ బెంజిమన్ లు కలసి మాట్లాడుతూ గుంటూరు నగరం మరియు పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ కర్ఫ్యూ నేపథ్యంలో పేద,మధ్యతరగతి బ్రాహ్మణ,క్రిస్టియన్, ముస్లిం దేవాలయాలలో పనిచేస్తున్న కుటుంబాలు ఆర్థికముగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరోనా కారణంగా ప్రజలు గుడి,చర్చ్ ,మసీదు లకు వెళ్లటం లేదని, దానివల్ల వివిధ ప్రార్ధనాలయాల్లో పనిచేస్తున్న అన్ని మతాలకు చెందిన ప్రీస్ట్ లు అనేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న నేపద్యంలో  వారికి 3 వారాలకు సరిపోయే నిత్యావసర వస్తువుల్ని బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా ఆధ్యాత్మిక పూజార్లకు ఈ సహకారం నిత్యం అందజేయడం జరుగుతుందని తెలిపారు.  గత సం. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా 60 రోజులపాటు అన్ని సామాజిక వర్గాల వారికి “బ్రాహ్మణ చైతన్య వేదిక” ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పుడు కూడా ఈ “కరోనా కర్ఫ్యూ సడలించే వరకు” ఈ సేవా కార్యక్రమం ప్రతిరోజు రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించటం జరుగుతుందని శ్రీధర్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో షేక్ బషీర్ అహ్మద్, మంచిరాజు శారద, వడ్లమూడి రాజ,  వడ్డమాను ప్రసాదు,  మతుకుమల్లి సాయి, వేములపాటి నాగేంద్రబాబు,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.