చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు: పేర్ని నాని

267

అమరావతి: సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు, లోకేష్ ఓర్చుకోలేక పోతున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 30తో సీఎం జగన్ పాలనకు రెండేళ్లు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు చేయలేని కార్యక్రమాలు రెండేళ్ల పాలనలో సీఎం జగన్ ఎన్నో చేశారన్నారు. ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు అధికారం చేపట్టాక మర్చిపోయారన్నారు. ‘‘సీఎం వైఎస్ జగన్ పట్ల ఆదరాభిమానాలు పెరుగుతున్నాయి. మేనిఫెస్టోలోని 94.5 శాతం వాగ్దానాలను రెండేళ్లలో సీఎం జగన్ పూర్తి చేశారు. వైఎస్ జగన్‌ సంక్షేమ పాలనపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ పట్ల ఆదరాభిమానాలు పెరుగుతున్నాయి. ఉన్నత చదువుల ద్వారానే పేదరికం పోతుంది. అందుకే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని’’ పేర్ని నాని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా ఉందన్నారు. కోవిడ్‌తో ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు క్షుద్రరాజకీయాలు చేస్తున్నారని  పేర్నినాని మండిపడ్డారు.