కోతులను చూసి నేర్చుకుందాం

304

అక్కడ కరోనా నియమాలు పాటిస్తున్న కోతులు…

కోవిడ్ నిబంధనలు పాటించడం లో మనుషులకు ఆదర్శంగా నిస్తున్నాయి కోతులు. భౌతిక దూరం పాటిస్తూ ఆహారం తీసుకుంటున్న ఘటన పుత్తూరు మండలం కైలాసకోన పర్యాటక కేంద్రం వద్ద చోటు చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా పర్యాటక కేంద్రం మూతపడడంతో కోతులకు ఆహరం అందడం లేదు. దాంతో కోతులకు ఆహారం పెట్టడానికి సిద్ధపడింది కైలాసనాధ ఆలయ కమిటీ. కోతులు భౌతిక దూరం పాటించేలా రోడ్డుపై మార్కింగ్ చేసారు కమిటీ సభ్యులు. అయితే క్రమం తప్పకుండా ఆ మార్కింగ్ లో కూర్చొని ఆహారం తీసుకుంటున్నాయి కోతులు. కోతుల క్రమశిక్షణ చూసి సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.