నేనున్నా.. మీకేం కానివ్వను!

588

కోవిడ్‌ బాధితులకు కొండంత అండగా ఎమ్మెల్యే వంశీ

రాత్రి 3.30 గంటలు..
గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్‌ ఫోన్‌ రింగవుతోంది..
ఉలిక్కిపడి లేచి ఫోన్‌ లిఫ్ట్‌ చేశారు..
‘ఒక పాప ఏడుస్తూ మాట్లాడుతోంది.. సార్‌.. మా అమ్మకి బాగా సీరియస్‌గా ఉంది. కరోనా సార్‌.. 3 రోజుల క్రితమే మా నాన్న కరోనాతో చనిపోయారు. ఇప్పుడు మా అమ్మకి అస్సలు బాగోలేదు. నాకు చాలా భయంగా ఉంది సర్‌. ఏమీ చేయాలో తెలియడంలేదు. హెల్ప్‌ చేయండి సార్‌.. ప్లీజ్‌..’ అని ఏడుస్తోంది..
‘ఒక్కసారి నిద్రమత్తు వదిలి.. నేను చూసుకుంటానమ్మా.. మీ ఇంటి అడ్రస్‌ చెప్పు అని వంశీ వివరాలు తెలుసుకున్నారు. మీ అమ్మకి ఏం కాదు. నేనున్నాను.. ధైర్యంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది.’ అని భరోసా ఇచ్చి ఫోన్‌ కట్‌ చేశారు.

ఆ పాప ఇంటికి వెంటనే తన ఆఫీసు సిబ్బందిని పంపించారు. ఈలోపు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బెడ్‌ మాట్లాడారు. పాప తల్లికి వెంటిలేటర్‌ అవసరం. ఆస్పత్రిలో చేర్పించి వెంటిలేటర్‌ చికిత్స అందేలా చూశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని సొంత మనిషిలా ఏంకావాలో చూసుకున్నారు. 4 రోజులకు ఆమె మెల్లగా కోలుకుంది.

ఆ పాప హ్యాపీ.. తండ్రి ఎలాగూ లేడు. కనీసం తల్లయినా దక్కింది.. ఎమ్మెల్యే స్పందించకపోయి ఉంటే పాప అనాథ అయిపోయేది. ఎమ్మెల్యే వంశీమోహన్‌ చొరవతో ఆ అమ్మాయి జీవితం నిలబడింది..
ఇలా ప్రతిరోజు ఎంతో మందికి ప్రాణం పోస్తున్నారు వంశీ. కొందరు ఎమ్మెల్యేలు కనీసం ఆస్పత్రిలో బెడ్‌ కూడా ఇప్పించలేకపోతున్నారు. ఇప్పించినా చికిత్స చేయించలేకపోతున్నారు. పరిస్థితి అలా ఉంది ఆస్పత్రుల్లో.. కానీ వంశీ అలా కాదు. తనకు ఎవరు ఫోన్‌ చేసినా వారికి ఆస్పత్రిలో బెడ్‌ అవసరమైతే బెడ్‌.. ఆక్సిజన్‌ అవసరమైతే ఆక్సిజన్‌.. ఏది కావాలంటే అది సమకూరుస్తున్నారు. వారు కోలుకునే వరకూ వెన్నంటి ఉండి ధైర్యం ఇస్తున్నారు.

గన్నవరం నియోజకవర్గం ఒక్కటే కాదు. జిల్లాలో తనకు ఎవరు ఫోన్‌ చేసినా, తన కార్యాలయాన్ని ఎవరు సంప్రదించినా అందరికీ ట్రీట్‌మెంట్‌.. కులం లేదు.. మతం లేదు. పార్టీ లేదు.. తన నియోజకవర్గమని లేదు.. ప్రాంతమని లేదు. ఆపదలో ఉన్న ఎవరినైనా రక్షించడమే ఆయన పని. ఇందుకోసం 24 గంటలు పనిచేస్తున్నారు..

బెడ్లు, ట్రీట్‌మెంట్‌ కోసం తాను రిఫర్‌ చేసినప్పుడు డాక్టర్లు ఆక్సిజన్‌ కొరత, మందుల కొరత గురించి చెబుతుండడంతో ఏంచేయాలా అని ఆలోచించారు. ఏమైనా చేయాలనుకున్నారు. వెంటనే విజయవాడ ప్రభుత్వాస్పత్రికి సొంత డబ్బుతో 100 ఆక్సిజన్‌ సిలిండర్లు కొని ఇచ్చారు. గనవరంలోని పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాల ఆస్పత్రికి మరో 100 ఆక్సిజన్‌ సిలిండర్లు కొని ఇప్పించారు. ఆక్సీమీటర్లు, మందులు ఇలా ఆస్పత్రులకు కోవిడ్‌ సమయంలో ఆయన తన సొంత సొమ్మును లక్షలు ఖర్చు చేశారు.

అయినా ఆయనపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు.   ఏ ఎమ్మెల్యే అయినా తన సొంత డబ్బును ఆస్పత్రులకు ఇచ్చారా? ఫోన్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ధైర్యం చెప్పి చికిత్స చేయిస్తున్నారా? ఇవన్నీ చేస్తున్నందుకా ఆయనపై విమర్శలు.! ఆయన మాత్రం ఎవరినీ పట్టించుకోవడంలేదు. ఏ విమర్శలు, ఆరోపణల్ని వినిపించుకోవడంలేదు. కోవిడ్‌ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో ప్రజలకు అండగా ఉండడమే లక్ష్యంగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. ప్రజలకు తాను జవాబుదారీ.. అందుకే వారి కోసం నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. ఎవరికి కరోనా వచ్చినా తన సొంత వారికి వచ్చినట్లు ఫీలై చికిత్స అందేలా చేస్తున్నారు.

నాయకుడంటే ధైర్యం ఇవ్వాలి.. ఆపద వస్తే ఆదుకోవాలి.. తనను నమ్మిన ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించాలి.. అలాంటి వాడే అసలు సిసలు ప్రజా నాయకుడు.. అతడే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌..
 – అనగాని రవి