క‌రోనా దేవి విగ్ర‌హం.. ఆ న‌టిలా ఉందంటూ కామెంట్స్‌..!

213

కొవిడ్ సెకండ్ వేవ్‌లో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు కోయంబ‌త్తూరు జిల్లాలో ప్ర‌జ‌లు మాత్రం దేవుడ్ని న‌మ్ముకున్నారు. వారు క‌రోనా దేవి అంటూ ఓ విగ్ర‌హాన్ని త‌యారు చేసి దానికి పూజ‌లు చేస్తున్నారు. ఈ ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజ‌న్స్ త‌మ క్రియేటివిటీకి ప‌ని చెప్పారు. క‌రోనా దేవి ఫొటో, హీరోయిన్ వ‌నితా విజ‌య్ కుమార్‌లా ఉందంటూ మీమ్స్ త‌యారు చేసి కామెంట్స్ చేశారు. ‘ఓరి దేవుడా! ఇదేంటి, ప్ర‌తి ఒక్క‌రూ ఈ ఫొటోతో పాటు మీమ్స్ పంపుతున్నారు’ అంటూ ఈ కామెంట్స్‌పై వ‌నితా విజ‌య్ కుమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.