మరో మల్టీస్టారర్‍ ప్లాన్‍ చేస్తోన్న అనిల్‍ రావిపూడి?

526

తనదైన మార్క్ టైమింగ్‍ తో, డైలాగ్‍ లతో వరుస విజయాలను అందుకుంటున్న దర్శకుడు డైరెక్టర్‍ అనిల్‍ రావిపూడి. డీసెంట్‍ కామెడీని బాగా హ్యాండిల్‍ చేస్తాడు అనే మంచి నేమ్‍ ఉంది అనిల్‍ కి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ఎనర్జిటిక్‍ స్టార్‍ రామ్‍ – మాస్‍ మహారాజా రవితేజ కలయికలో ఒక మల్టీస్టారర్‍ ను అనిల్‍ ప్లాన్‍ చేయబోతున్నాడని… ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని తెలుస్తోంది. అనిల్‍ రైటర్‍ గా ఉన్నప్పటి నుండి రామ్‍ తో మంచి అనుబంధం ఉంది.అలాగే రవితేజతో ఆల్‍ రెడీ ఒక సినిమా కూడా చేశాడు.కాబట్టి అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది చివర్లో ఈ ముగ్గురు కలయికలో సినిమా వచ్చే అవకాశం ఉందట. ఇక ఈ సినిమా కూడా అనిల్‍ సినిమాల శైలిలోనే ఫుల్‍ ఎంటర్‍ టైనర్‍ గా ఉండనుంది. మొత్తానికి కమర్షియల్‍ ఫార్ములాను ఫాలో అయ్యే దర్శకుల్లో ఫన్‍ మీద ఎక్కువగా దృష్టిపెట్టే డైరెక్టర్‍ అనిల్‍ కావడంతో ఆయనకు డిమాండ్‍ బాగా పెరిగింది. కాగా ఈ యంగ్‍ టాలెంటెడ్‍ డైరెక్టర్‍ ప్రస్తుతం వెంకటేష్‍, వరుణ్‍ తేజ్‍ తో కలిసి ‘ఎఫ్‍ 3’ సినిమా చేస్తున్నాడు.