గుంటూరులో 52ఆస్పత్రులకు జరిమానా

243

ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై అధికారులు కొరడా ఝళిపించారు. ఆరోగ్యశ్రీ కింద 50శాతం పడకలు ఇవ్వని ఆస్పత్రులపై గుంటూరు జిల్లా అధికారులు భారీగా జరిమానా విధించారు. గుంటూరు జిల్లాలో 52 ఆస్పత్రులకు మొత్తంగా రూ.1.25కోట్ల జరిమానా విధించినట్టు కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ వెల్లడించారు. 25 ఆస్పత్రులకు రూ.2లక్షల చొప్పున;  12 ఆస్పత్రులకు రూ.5లక్షల చొప్పున; 15 ఆస్పత్రులకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్టు ఆయన వివరించారు.