జగన్ ఆసుపత్రులను ఎందుకు సందర్శించడం లేదు?

215

టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత,  నారా చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..

టీడీపీ నేతల హౌస్ అరెస్టు లను తీవ్రంగా ఖండిస్తున్నాం.  ప్రజల ప్రాణాలు పోతున్నా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ గడప దాటడం లేదు.  రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కుల్ని హరించే విధంగా ముఖ్యమంత్రి జగన్  నిరంకుశ పాలన సాగిస్తున్నారు.

ప్రశ్నించే గొంతులు ఉండకూడదు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని కరోనా ఆస్పత్రులను సందర్శించనున్న టీడీపీ నేతలను హౌస్  అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం.  కరోనా రోగులకు ధైర్యం చెప్పి ఆసుపత్రుల్లో ప్రజలకు అందుకున్న చికిత్స, సౌకర్యాలను పరిశీలించేందుకు టీడీపీ నాయకులు వెళ్తే ప్రభుత్వనికి వచ్చిన నష్టమేంటి?    రాష్ట్రంలో సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నా.. ముఖ్యమంత్రి గడప దాటి బయటకు రాడు, ప్రజలకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ నేతలు వెళ్తుంటే మాత్రం అరెస్ట్ చేస్తారా? ముఖ్యమంత్రి ఆసుపత్రులను ఎందుకు  సందర్శించడం లేదు?

ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రికి బాధ్యత లేదా?  ఏడాది నుండి కరోనా విలయతాండవం చేస్తున్నా ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు పర్చడానికి చేసింది శూన్యం.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, 45 ఏళ్ళు నిండిన వారికి ఇంకా పూర్తి స్థాయిలో వ్యాక్షిన్ ఇవ్వలేదు.  నిరుపేద రోగుల నుంచి  లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రవేట్ ఆసుపత్రులపై నియంత్రణ చర్యలు లేవు.  స్మశానాల్లో కూడా టోకెన్లు తీసుకునే దుస్థితి ప్రజలకు వచ్చింది కరోనా నివారణలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.    ఈ ప్రభుత్వన్ని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈడినట్టేనని ప్రజలు భావిస్తున్నారు.  అందుకే కరోనా రోగులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు వైద్యం కోసం ఇతర  రాష్టాలకు వెళ్తున్నారు.  రాష్ట్రంలో పరిస్థితి ఈ విదంగా ఉంటే జగన్ మాత్రం ప్రజల ప్రాణాలు గాలికొదిలి  ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, హౌస్ అరెస్ట్ లతో ఆనందం పొందుతున్నారు.