అన్నమయ్య చూపిన బాటలో యువత పయనించాలి

376

ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు

పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ‘‘సామాజిక వివక్షను నిరసిస్తూ, అందరి అంతరాత్మ శ్రీహరే అంటూ తమ సంకీర్తనలతో సమాజాన్ని చైతన్యపరచిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య జయంతి సందర్భంగా ఆ వాగ్గేయకారుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను.మానవ జీవితాన్ని పద కవితల్లో అల్లి, భక్తి భావ పరిమళాలు అద్ది, సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా అన్నమయ్య రచించిన కీర్తనలు మధురానుభూతిని పంచడమే గాక మార్గనిర్దేశం చేస్తాయి. వారి కీర్తనల్లోని తత్వాన్ని ఆకళింపు చేసుకుని, వారు చూపిన బాటలో యువత పయనించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.