లాంగ్ క్వారంటైన్ వదలి జగన్ కోవిడ్ ఆసుపత్రులను సందర్శించాలి

363

ముఖ్యమంత్రులందరూ ఆసుపత్రులు సందర్శిస్తుంటే జగన్ ఆచూకీ కనబడటంలేదు.
 కోవిడ్,బ్లాక్ ఫంగస్ రోగులకు అందరికీ ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలి :మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

అనపర్తి మండలం రామవరంలో మాజీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ
1.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులను సందర్శించి  కోవిడ్ ఆసుపత్రిలో  బాధితులకు వైద్య సదుపాయాలు,భోజన సదుపాయాలు ఏ విధంగా అందుతున్నాయి ,మిగిలిన వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాలను పరిశీలించడం కోసం సంకల్పించడం  జరిగింది.

2.దానిలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరుపున  బాధితులకు బాసట గా అనే కార్యక్రమం చెప్పట్టి రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిని సందర్శించడానికి  ప్రయత్నం చేయడం ఉదయం 8 గంటలకు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించేది ఒక్కటే  ఈ వాళ్ళ  మీ చేతకానితనం వల్ల, మీ అసమర్థత వల్ల రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తికి కారకులైయ్యారు.

3.కోవిడ్ భారతదేశంలో అత్యధికంగా ఉన్న దేశం అంటే  అందులో అతి ముఖ్యoగా ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందానికి కారణం మీరు.స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం, కోవిడ్ కి సంబంధించి సరైన నియంత్రణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోకపోవడo వల్ల ఈ వేళ కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది.

4.ఈ రోజు మీరు 151మంది ఎమ్మెల్యే లు గెలిచాం మాకు తిరుగులేదు అని మాట్లాడుతున్నారు.ఈ వేళ ముఖ్యమంత్రి గా కనీసం మస్కు కూడా పెట్టుకోకుండా ప్రజలకి ఏ విధమైన సందేశం ఇస్తున్నారు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.

5.ఈ వేళ యితర రాష్ట్రలో ముఖ్యమంత్రు లు ఏ విధంగా పని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏ విధంగా పని చేస్తున్నారు.75 సంవత్సరాల స్టాలిన్ కోవిడ్ ఆసుపత్రులను సందర్శించి బాధితులకు ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. 78 సంవత్సరాల కేరళ ముఖ్యమంత్రి గా ఆసుపత్రులను సందర్శించమే కాదు,అత్యద్భుతంగా  కోవిడ్ ను  నియంత్రణ చేశారు.కర్ణాటక ముఖ్యమంత్రి , ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ, కేరళ ముఖ్యమంత్రి కానీ,యితర ముఖ్యమంత్రులు  కోవిడ్ ఆసుపత్రులను సందర్శించి బాధితులకు ధైర్యన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూన్నారు.

6. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు  మాత్రం తాడేపల్లి ప్యాలస్ లో లాంగ్  క్వరంటైన్ ఉండడం జరుగుతుంది.ఈ వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మిస్సింగ్ అనే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రులoదరూ ఆసుపత్రులు సందర్శిస్తుంటే జగన్ ఆచూకీ కనబడటంలేదు.కోవిడ్ కు సంబంధించి పారాసిటీమల్ చాలు,బ్లీచింగ్ పౌడర్ చాలు, సహజీవనం చేయాల్సిందే అని చాలా చులకనగా మాట్లాడి ఈ వేళ ఆంధ్ర ప్రజానీకనికి చేదు అనుభవాలు మిగిల్చిన  ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే.

7.ఈ వేళ ప్రజానీకానికి అంత  ఒక్కటే ఆలోచన చేస్తుంది ఈ విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా ఉండి ఉంటే  ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లు కొరత కానీ, మందుల కొరత కానీ, వ్యాక్సిన్ కొరత కానీ, వైద్య సదుపాయాలు కోరత కానీ లేకుండా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మెరుగైన వైద్య సదుపాయాలు అంది ఉండే దాని  అని ప్రజానీకం అంతా ఆలోచన చేస్తుంది.

8.ఈ వేళ తెలుగుదేశం పార్టీ బాధితులకు బాసట గా అనే కార్యక్రమం చెప్పట్టి బాధితులతో ఇంట్రాక్ట్ అవి వారిని పరామర్శిస్తే,బాధితులు  వారి విషయాలు తెలిపి తెలుగుదేశం పార్టీ తరుపు మాజీ ఎమ్మెల్యే లు కానీ, నాయకులు మాత్రమే వచ్చారు కానీ   వైస్సార్సీపీ వాళ్ళు ఎవరు  రాలేదు అని తెలుపుతారు అని  ఉద్దేశ్యంతో ఈ వేళ ఈ విధoగా  తెలుగుదేశం పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన   విషయం.

9.మనం ప్రజా స్వామ్యం లో ఉన్నామా నియoతృత్వం పాలనలో ఉన్నామా అని ఆలోచన చేయల్సిన అవసరం ఉంది.ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.

10.బ్లాక్ ఫంగస్ వ్యాప్తిలో దేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఇది మొదటి స్థానానికి వెళ్లే పరిస్థితి.కోవిడ్ బాధితులకు,బ్లాక్ ఫంగస్ బాధితులకు ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందని పరిస్థితి. కోవిడ్, బ్లాక్ ఫంగస్ రోగులు అందరికీ తక్షణమే మేరుగైన వైద్యo విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.18 – 45 సంవత్సరాల వాళ్ళకి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలి.కోవిడ్ ఆసుపత్రిలోని వైద్యులకు,వైద్య సిబ్బందికి గాని అందరికీ  ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి సకల సౌకర్యాలు కల్పించాలి. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వారికి అన్ని సదుపాయాలు కల్పించాలి.జగన్మోహన్ రెడ్డి కోవిడ్ ఆసుపత్రులను సందర్శించి ,కోవిడ్ బాధితులకు ఆక్సిజన్, మందులు, వైద్య పరికరాలు,మెరుగైన వైద్య సదుపాయాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ సమావేశంలో అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి,అనపర్తి మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి,అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవదనారెడ్డి,అనపర్తి మండల తెలుగు రైతు అధ్యక్షులు సుబ్బారెడ్డి,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బాబురావు,భాస్కర రెడ్డి,KV, వైజాగ్ GV, సూర్రెడ్డి,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను,మాజీ ఎంపీటీసీ సూర్యప్రకాష్,సత్య, వెంకటరెడ్డి,సోమరాజు, సాయి, మండల & గ్రామ నాయకులు పాల్గోన్నారు.