ఇంటిపైకి దాడి చేయడానికొచ్చి జనార్ధన్ రెడ్డిపైనే కేసులా?

328
టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. జనార్ధన్ రెడ్డి ఇంటిపైకి దాడి చేయడానికొచ్చి జనార్ధన్ రెడ్డిపైనే కేసులా? అని  టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

బీసీ జనార్ధన్ రెడ్డి అరెస్టుపై కర్నూలు నాయకులతో చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసులు ఉన్నది దొంగలకు రక్షణ కల్పించడానికా? అని నిలదీశారు. బీసీ జనార్ధన్ రెడ్డిపై, తెలుగుదేశం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. కర్నూలులో కరోనాతో, బ్లాక్ ఫంగస్‌తో ప్రజలు చనిపోతుంటే వైసీపీ రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తుందని మండిపడ్డారు.

ఆదివారం నాడు ఎనిమిది మంది టీడీపీ నాయకులను అరెస్టు చేసి ఆరుగురిని ఇంత వరకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని విమర్శించారు. బీసీ జనార్ధన్ రెడ్డి విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడుతామన్నారు. వైసీపీ దుర్మార్గాలపై కరోనా నిబంధనలు పాటిస్తూ వర్చువల్ యాజిటేషన్‌కు చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలీసులు చేస్తున్న దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. హైకోర్టు డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ అని వ్యాఖ్యానించినా, సిగ్గురాలేదని చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు.