ఫ్లై ఓవర్‌‌ నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

192

నిన్న ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. సమీపంలోని వారు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్‌లో యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. . ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుంచి కిందకు దూకడంతో కాళ్లకు, వెన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కాగా యువతి ఆత్మహత్యాయత్నంకు కారణాలు తెలియాల్సి ఉంది.