ఇదే జరగాలి…!

491
మనకేవీ ఉచితాలొద్దు –
కేవలం విద్యా వైద్యం తప్పా!
జనం కోసం
అవీ ఇవీ  గొప్పలు
ఏమీ చేయనక్కరలేదు !
హృదయంలో తడి లేని  పొడి పొడి ప్రేమలు
కురిపించనవసరం లేదు !
ప్రధాన మంత్రైనా
ముఖ్య మంత్రైనా
రాష్ట్ర కేంద్ర మంత్రులు
MLA& MP కలెక్టర్ ల పిల్లలను
ప్రభుత్వ పాఠశాలల్లోనే
చదివిస్తే చాలు !
మేమూ మనుషులమే
పశువులం కామని ఒప్పుకొని
ప్రభుత్వ ఆసుపత్రిలోనే
వైద్యం పొందాలనే
నిబంధనలు చేర్చి  100% అమలు పరిస్తే చాలు
మనదేశమిక  బాగుపడ్డట్టే !
తెలుసా నిజానికి దేశమెందుకు పాడవుతుందో !?
జనం నుంచి నాయకులు
విడిపోయినందుకే !
నాయకులు ఉన్నతాధికారులు
జనంలోకొస్తే అదో అద్భుతం జరిగినట్టే ! అవును నిజం !
నాయకులారా ! ఉన్నతాధికారులారా ! మీ గొప్పతనమంతా ఆకాశంనుంచి ఊడి పడ్డది కాదు !జనం ఇచ్చిందే !
జనానికి మీరు దూరం కావడం కాదు జరగాల్సింది-
జనంలో ఒకరు కావాలి!
మీరు మాత్రమే మనుషులు కారనీ…..
మీవి మాత్రమే ప్రాణాలు కావనీ
అందరూ మనుషులేనన్న
సత్యం ఒప్పుకోండి చాలు!
ఒట్టి కపట ప్రేమలు కాదు
చిత్త శుద్దిని చూపండీ !
సమానత్వం ఒప్పుకోని
హితవచనాలేవైనా
అవి విషపూరితాలే సుమా !
అసమానత్వమే అంటరానిదని
వెలివేద్దాం! వెలుతురవుదాం !
 ఎ. చంద్రమోహన్.అధ్యక్షుడు
                                                                         TPTF,కొండాపూర్,సంగారెడ్డి!