సీనియర్ జర్నలిస్ట్ పైడి లక్ష్మణరావు ఆకస్మిక మృతి

473

సీనియర్ జర్నలిస్ట్, పైడి పలుకులు మరియు న్యూస్ టైం వెబ్ ఛానల్ తో అందరికీ సుపరిచితులు, నా ఆత్మీయ మిత్రుడు పైడి లక్ష్మణరావు  అకస్మాత్తుగా మరణించారు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. జర్నలిస్టులు వృత్తి పరంగా ఉన్న ఒత్తిడితో, అకారణంగా ఈ విధంగా మన నుంచి దూరం అవడం, మనకు ఎంతో మానసిక క్షోభకు గురి చేస్తుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. పిట్టల్లా రాలిపోతున్న జర్నలిస్టులను కాపాడుకోకపోతే,  జర్నలిజమే మిగలదు అనే చేదు నిజాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక గ్రహించాలి. ఇప్పటికైనా లక్ష్మణరావు కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూత కల్పించాలి. లక్ష్మణరావు  పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి.లక్ష్మణరావు  కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి. సీనియర్,మొదటి తరం జర్నలిస్టు పైడి లక్షణ రావు మరణం జర్నలిస్టు ఆకలి చావుతో సమానం. ఖచ్చితంగ యావత్ జర్నలిస్టుల మనసులను ఈ ప్రభుత్వం గాయపరిచింది.