రైతుల కష్టాలు జగన్‌కు కనబడుతున్నాయా?:దేవినేని ఉమ

139

అమరావతి: వరుసగా రెండో ఏడాది మామిడి రైతులకు తీవ్ర నష్టాలు వచ్చాయని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ధర పతనంతో పెట్టుబడి కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో లారీలు సైతం తోటల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇంకా దాదాపు 50 శాతం కాయలు తోటల్లోనే ఉన్నాయని ఆందోళన చెందుతున్న రైతుల కష్టాలు జగన్‌కు కనబడుతున్నాయా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. నెల నుంచి కల్లాల్లోనే ధాన్యపు రాశులున్నాయని, క్వింటాకు  10కేజీల తరుగుతో ఇష్టమైతే అమ్మండి లేదా వెళ్లిపోండంటున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. పంటను కాపాడుకోలేక నరకయాతన పడుతున్నారని,  తాతలనాటి నుండి వ్యవసాయం చేస్తున్నాం, ఎప్పుడూ ఇన్ని అవస్థలు పడలేదంటున్న రైతుల కష్టాలు కనబడటం లేదా ఎద్దేవా చేసారు.ఏప్రిల్ లో క్వింటా 10వేలుపలికిన నిమ్మధర నేడు ఒక్కసారిగా 3వేలకు తగ్గిందని బస్తా కాయలు కోయడానికి 200లు, రవాణా 20/-, గ్రేడింగ్ కు 5/-, వ్యవాపారుల కమీషన్ పోను ఏమాత్రం గిట్టుబాటు కావడంలేదన్నారు. పతనమైన ధరతో రాబడంతా దళారుల పాలై ఆందోళన చెందుతున్ననిమ్మరైతుల కష్టాలు జగన్ కు కనబడుతున్నాయా అని ప్రశ్నించారు.