కౌన్సిల్‌కు సోము బై..బై!

229

సోమువీర్రాజు కృతజ్ఞతలు

శాసన మండలి సభ్యుడిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటంలో తనకు అన్ని విధాల సహకరించిన భాజపా, అనుబంధసంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలకు, తోటి శాసన మండలి సభ్యులకు, అధికార, ప్రతిపక్ష పార్టీలకు, ప్రజా సంఘాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు సోమువీర్రాజు కృతజ్ఞతలు తెలిపారు. సోమువీర్రాజు శాసనమండలి సభ్యత్వం సోమవారంతో పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రజాసమస్యల పరిష్కారం నిమిత్తం శాసనమండలి వేదికగా ఈ ఆరేళ్లలో పలు ముఖ్యమైన అంశాలపై తన వాణి వినిపించానన్నారు. గత, ఇప్పటి ప్రభుత్వాలు మంచి చేసిన సమయంలో అభినందించాను… అలాగే ప్రజా వ్యతిరేక విధానాలపై పాలక పార్టీలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న సమయంలో భాజపా, ప్రతినిధిగా సభ లోపల, బయట ఉద్యమాలు, పోరాటాలు చేసినట్లు చెప్పారు.

ప్రజాభిప్రాయం మేరకు పార్టీ ద్వారా పలు అంశాలు సభలో సమస్యల పురస్కారానికి చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా పేదప్రజల సమస్యలుపై ప్రజా ఆరోగ్యం, పిల్లలకు పౌష్టికాహరం విషయంలో అంగన్వాడి కేంద్రాలలో ప్రజలకు అందాల్సిన విషయంలో ప్రభుత్వ అధికారులను ఎండగడుతూ చేసిన ఉద్యమాలు సభలో కాని,బయటకాని విజయవంతమయ్యాయన్నారు. ఆవిషయంలో ఓక సభ్యుడిగా సంతృప్తినిచ్చే అంశంగా భావిస్తున్నానన్నారు. కోవిద్ విషయంలో ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ, మౌలిక సదుపాయాలు పెంచుకోవాలని గతంలోనే సభలో సూచించామన్నారు. ఈ పోరాటంలో తనకు అన్ని విధాల సహకరించిన అన్ని పార్టీలకు, మీడియా మిత్రులకు, ఉద్యోగ సంఘాలకు అధికారులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.