కేసీఆర్ మాటా..మజాకా?!

417

(సత్యరాం భీమప్ప) 

కరోన పేషెంట్ల పై కేవలం కరుణ చూపేందుకే, రోగులను కలిసి ఆరోగ్యాలను అరుసు కునేందుకు కల్వకుంట్ల సీఎం గారు కలిశారంటారా?
తాను ముఖ్యమంత్రి అయి ఎనిమిదేళ్లు అయినా,  ఎప్పుడూ ఎంజీఎం చూడని ఆయనకు అకస్మాత్తుగా ఈ ఎందుకింత ప్రేమ కలిగింది అంటారు? ఎందుకంటే ఆయన ఏది చేసిన ఒక బలమైన కారణం ఉంటేనే కదులుతారు.. కలుస్తారు కనుక!
ఒకే దెబ్బకు మూడు పిట్టలను కొట్టేందుకేనేమో?!

ఒకటో పిట్ట .జన సానుభూతి పిట్ట: సెకండ్ వేవ్ కరోనాను నిర్లక్ష్యంచేసి  జన ప్రయోజనం కన్నా తన ప్రయోజనమే ముఖ్యమనుకుని, తనకు కావలసిన ఎన్నికలన్ని నిర్వహించుకున్నారు,
కోర్టుఒత్తిడికి తట్టుకోలేక ప్రజలకు ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండానే, లాక్ డౌన్ విధించి ప్రజలు పడుతున్న కష్టాలకు ప్రజలే బాధ్యత అని గాలికొదిలేసిన దానికి సానుభూతి పొందేందుకూ.

రెండో పిట్ట కన్స్ట్రక్షన్ పిట్ట:  సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణం పిట్ట . అత్యవసర సమయంలో కరోనా గానీ మిగతా రోగాలకుగాని తగిన ట్రీట్మెంట్ కి కావలసిన సదుపాయాలు కల్పించకుండా ప్రజలకు ఎంజీఎం పైన అపనమ్మకం భయం పెరిగేటట్లు చేసి, ఇపుడు కొత్త హాస్పిటల్ కడితే గాని ఈ సమస్యకు పరిష్కారం లేదన్నట్లుగా.. త్వరలో సెంట్రల్ జైల్ తీసేసి ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణం చేపడతాం అని చెప్పడం దేనికంటే… కాలేశ్వరం,సచివాలయం, హైవే రోడ్ లు, కలెక్టరేట్ ఆఫీస్ ల  నిర్మాణాలు  చేసే కన్స్ట్రక్షన్ కంపెనీలను ఖాళీగా ఉంచకుండానా?, కమీషన్ల ప్రవాహం ఆగకుండానా? సరే అప్పటి వరకైనా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి అందరికీ ఆధునిక వైద్యం అందిస్తా మనీ ఒక మాట చెప్పక పోతిరి సీఎం సార్ అంటే మీ కన్నంతా కన్స్ట్రక్షన్ పిట్ట మీదనేనా అనిపిస్తోంది!

మూడో పిట్ట : సెంట్రల్ జైల్ కూల్చడం కొత్త జైలు కట్టడం: ఇది కూడా కాసులు రాల్చే కన్స్ట్రక్షన్ పిట్టనే .గతంలో మిమ్మల్ని కొంతమంది పిట్టల దొర అంటంటే ఏమో అనుకున్నం కానీ
వరంగల్ లో వలవిసిరి  3 కొత్త పిట్టలు పట్టేసావు సారు( 1 కొత్తజన సానుభూతి, 2కొత్త హాస్పటల్ 3 కొత్త జైలు) అబ్బా ఎంతైనా పేరుకు పేరు జోరు జోరు.  అంటే ఏ మంత్రిత్వ శాఖను మీ దగ్గర పెట్టుకుంటారో ఆ శాఖలో కన్స్ట్రక్షన్ లే కన్స్ట్రక్షన్ లన్నమాట.  మీ దగ్గరున్న కంపెనీలకు పండగే పండగ అన్న మాట.  కేసీఆర్ మాట.. మజాకా! అయ్యా సారు…తెలంగాణ ప్రజల కష్టాలు తీరేలా ఒకసారి  పోయిరా  గా కేరళ!!