డాక్టర్ సుధాకర్ మరణం ప్రభుత్వం హత్యే

271

అమరావతి జేఏసీ బాలకోటయ్య, మాజీ జడ్పీటిసి కోగంటి బాబు

కంచికచర్ల ,మే22: నర్సీపట్నం  దళిత డాక్టర్ సుధాకర్ గుండెపోటుకు గురై మృతి చెందటానికి  ప్రభుత్వమే బాధ్యత వహించాలని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య,  మాజీ జడ్పీటిసి కోగంటి బాబు ఆరోపించారు. శనివారం  కంచికచర్లలో సుధాకర్ నివాళి కార్యక్రమం నిర్వహించారు .రాష్ట్ర ప్రభుత్వం మాస్కూలు అడిగిన నేరానికి సుధాకర్ ను సస్పెండ్ చేసి, అరెస్టు చేసి మనోవేదనకు గురి చేసినట్లు  తెలిపారు. వైకాపా పార్టీ ఇందుకు తగిన మూల్యం చెల్లిస్తుందని పేర్కొన్నారు. సుధాకర్ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం దళితుల పట్ల వ్యవహరిస్తున్న వైఖరిని దళిత, బహుజనులు ఖండించాలి అని పిలుపునిచ్చారు  కోగంటి బాబు మాట్లాడుతూ క్రింది కులాల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్న దని ఆరోపించారు. ఇలాంటి పాశవిక చర్యలను ఖండించాలని, సుధాకర్ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  గూడవల్లి గణేష్, జంపాని ప్రసాద్ ,షేక్ జానీ,  సీతారామయ్య,ప్రతీప్ తదితరులు పాల్గొన్నారు.