సేఫ్‌ను సందర్శించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు,ఎమ్మెల్యే అంబటి

260

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా  రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను తయారు చేయుటకు అనుమతి పొందిన సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాళ్ళ మండలంలోని గోల్లపాడు వద్ద గల సేఫ్ పేరెంటరల్స్ సంస్థను ఈరోజు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, సత్తెనపల్లి శాసన సభ్యులు అంబటి రాంబాబు గారు సందర్శించారు.

సేఫ్ పేరెంటరల్స్ సంస్థలో 5లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను తయారు చేయుటకు రెండురోజుల క్రితం కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే లు కంపెనీని సందర్శించి, ఇంజెక్షన్ల తయారీ విధానాలు, తదితర అంశాలపై సిబ్బందితో చర్చించారు. ఈ కంపెనీకి అనుమతి లభించేలా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఎంతో కృషి చేశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రసంగించారు.