కరోనా ఉంది రామ – వినుర వేమా 

314

చేతులకు గ్లౌజు, ముక్కు, మూతి పైన ఒక మాస్కు ||
చెంత నెపుడు మంచి శానిటైజరు ||
ఉండినంత గాని బయటికి పోరాదు ||
విశ్వదాభిరామ వినురవేమ ||

రెండు చేతులెత్తి నిండైన దండంబు ||
నేర్పు కొలది పెట్టు నీటుగాను ||
షేకు హ్యాండు అనుచు చేతులన్ కలపకు ||
విశ్వదాభిరామ వినురవేమ ||

ఎంత వారలైన ఎదురుపడిన గాని ||
దూరముండు దరిజేర బోకు ||
వారి తుమ్ము, దగ్గు వారుణాస్త్రము నమ్ము ||
విశ్వదాభిరామ వినురవేమ ||

మందు లేదు దీని మర్మమ్ము చూడగా ||
బాల వృద్దులకును ప్రాణ భయము ||
శుద్ధి , శ్రద్ద ఒకటే దీని నాప గలదు ||
విశ్వదాభిరామ వినురవేమ ||

కోవిడున్న వాడు, లేని వాడు ఒక్క తీరుగనుంద్రు,
చూడగాను నెలకు తెలియు, నూకలున్న రేడు
విశ్వదాభిరామ వినురవేమ ||

తన శుభ్రమె తనకు రక్షతన దూరమె
తనకు భద్ర తన మాస్కుతొ తగ్గు రిస్కు
విశ్వదాభిరామ వినురవేమ ||

ఆహ్వానించదగిన బంధువైన
మాన్యుడైన, మనుజుడైన
కోవిడు తేగల, తేనెటీగలు వీరు
విశ్వదాభిరామ వినురవేమ ||

ప్రస్తుత కాలంలో మనము నేర్చుకొని,
పిల్లలకు నేర్పాల్సిన కొత్త పద్యాలు.
కేవలం కరోనా పై అవగాహన కోసం
ఒక భిన్న మైన ప్రయత్నం
అందరితో పంచుకోండి – అవగాహన పెంచండి

–   కైలాస్ నాగేష్
 ( రచయిత హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ కార్యదర్శి)