బాబుపై ఏడుస్తావెందుకు జగన్‌రెడ్డి?

250

సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నలు సంధించారు. ‘‘నీ బంధువు, నీ జైలుమేట్ కంపెనీ తయారు చేసే రెమ్‌డెసివిర్‌ని.. బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతూ జనాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. కొవిడ్‌ చికిత్సకు పనికిరాదని డబ్ల్యూహెచ్‌వో చెప్పిన.. రెమ్‌డెసివిర్‌ పేరుతో కోట్లు కొల్లగొట్టారు. సీబీఐ, ఈడీ కేసుల భయంతో ప్రధానిని వ్యాక్సిన్ కోటా అడగలేక.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏడుస్తావెందుకు జగన్‌రెడ్డి?. వ్యాక్సిన్‌కి డబ్బు ఇవ్వకుండా కొవాగ్జిన్ చంద్రబాబు బంధువులదని, మళ్లీ నంగి నాటకాలెందుకు?. కొవిషీల్డ్‌ కొనుగోలుకి చంద్రబాబు అడ్డంపడ్డారా?. 2 కంపెనీలు కమీషన్ ఇవ్వను అన్నాయా?. నీ దొంగ బంధువుల కంపెనీ.. వ్యాక్సిన్ తయారుచేసే వరకూ ప్రజల్ని చంపేస్తావా?’’ అని లోకేష్‌ ప్రశ్నించారు.