28న ‘క్యాబ్ స్టోరీస్’

447

ఇమేజ్‌స్పార్క్ ప్రొడక్షన్ నిర్మిస్తోన్న చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’ మే 28న స్పార్క్ ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ‘బిగ్ బాస్ 4’ ఫేమ్ దివి వధ్య, గిరిధర్, ధన్‌రాజ్‌, ప్రవీణ్, శ్రీహన్ మరియు సిరి ప్రధాన పాత్రల్లో నటించారు.

‘క్యాబ్ స్టోరీస్’ టీజర్‌ను సునీల్, వెన్నెల కిషోర్ మరియు శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. సునీల్ వాయిస్ ఓవర్‌తో క్యాబ్‌లోకి వచ్చే అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేయడంతో ఈ టీజ‌ర్ ప్రారంభమవుతుంది. అన్ని పాత్రలు ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటూ వారి ప్రయాణం ఆలస్యంగా ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. అనేక మలుపులు తిరిగిన వారి ప్రయాణం ఎందుకు ఆల‌స్యంగా ప్రారంభమైందో, ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మే 28 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.మే 25న ట్రైల‌ర్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు.

అవుట్ అండ్ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా నిర్మించబడిన ఈ ‘క్యాబ్ స్టోరీస్’ కు కేవీఎన్ రాజేష్ దర్శకత్వం వహించగా ఎస్ కృష్ణ నిర్మించారు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీని, సాయి కార్తీక్ సంగీతం, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.