విద్యార్థులకు ఇక ఉద్యోగాలు రావా?

458

-కార్పొరేట్ కంపనీల చేతుల్లో రోబోలా మారిన మోడీ !

దేశం అంతా కరోనాతో అల్లాడిపోతోంది. ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత ఏర్పడింది రోజూ వేల మంది మృత్యువాత పడుతున్నారు అది ఈ దేశానికి అంత మంచిది కాదు… మోడీ గారు ఇప్పుడున్న పరిశ్రమల్లో 15% సామర్ధ్యాన్ని మాత్రమే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ గా వాడుతున్నారు, మిగతా 85% ఇంకా పరిశ్రమలకి వాడుతున్నారు ఎందుకు…?

ఇందులో ఆ 15% ఆక్సిజన్ తీసుకుంటే అందులో 75% మళ్ళీ PSU ల ద్వారా వస్తుంది మిగిలిన 25% మాత్రమే ప్రైవేట్ కంపెనీలు అందిస్తున్నాయి… మిగిలిన 85% ఆక్సిజన్ కి ప్రైవేట్ కంపెనీలు ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నా కావాలని ఫిల్ చెయ్యడంలేదు ఎందుకు…?

జనం చనిపోతున్నా, దేశం శవాల దిబ్బగా మారిపోతున్నా మోడీ Lockdown ఎందుకు పెట్టలేదో మీకు తెలుసా…, ఇది కేవలం కార్పొరేట్ సంస్థలు మోడీతో చేయిస్తున్న దేశద్రోహం, నమ్మ శక్యంగా లేదు కదూ… మొత్తం చదివాక మీకే తెలుస్తుంది. మన దేశ ఆర్ధిక వ్యవస్థ పడిపోబోతుంది, నిజం ఈ దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలిపోబోతుంది మీరు చదువుతున్నది పచ్చి నిజం…

కరోనా మొదట వేవ్ నుంచి గట్టెక్కేము అని అందరూ అనుకుంటున్నారు… మొదటి వేవ్ లో జరిగిన నష్టం మీకు తెలుసా…? 20 కోట్ల మంది భారతీయులు, అందులో 10 కోట్ల మంది వలస కార్మికులు వాళ్ల పొట్ట కూటి (ఉపాధి)ని కోల్పోయారు, 6.8 లక్షల చిన్న, చితకా కంపెనీలు మూత పడ్డాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే (లోక్ సభలో) చెప్పారు… గత ఏడు సంవత్సరాల్లో ఒకటి కాదు, రెండు కాదు 6.8 లక్షల కంపెనీలు మూత పడ్డాయి వాటి మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమైందో మీరే ఆలోచించుకోండి… అది కేవలం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇంకా అనధికారికంగా ఎన్ని సంస్థలు మూత పడ్డాయో తెలీదు…

ఇక కరోనా సెకండ్ వేవ్ విషయానికొస్తే… దీన్ని ఎవ్వరూ ఊహించ లేదు, ఇంకా వివరంగా చెప్పాలి అంటే కార్పొరేట్ బడా సంస్థలు సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు, మన ప్రభుత్వం అయితే సెకండ్ వేవ్ తో పోరాడటానికి సిద్ధంగా కూడా లేదు…. సెకండ్ వేవ్ కి ముందు కార్పొరేట్ సంస్థలు అంబానీ, అదాని మొత్తం అప్పు చేసైనా సరే ప్రజల ఆస్థులైన ప్రభుత్వ రంగ సంస్థలను దక్కించుకోవాలని, మనమే ఈ దేశాన్ని ఏలుదామని దుర్మార్గపు కుట్ర పన్నారు, ఇక్కడే ప్రకృతి అడ్డం తిరిగి సెకండ్ వేవ్ వచ్చింది, ఇప్పుడు దేశమంతా ఆక్సిజన్ కొరత ఉంది ఇప్పుడు ఉన్న కార్పొరేట్ బడా బాబులు కొరత ఉన్న ఆక్సిజన్ సరఫరా చేసే సామర్ధ్యం వాళ్ళకి ఉంది అయినా వాళ్ల దగ్గర నుంచి రావాల్సినంత ఆక్సిజన్ సరఫరా ఎందుకు రావట్లేదు?

చాలా చాలా సింపుల్ ఆన్సర్….
ఇప్పుడు ఆ కార్పొరేట్ బడా బాబులు తీసుకున్న అప్పులకు వడ్డీ కట్టే పరిస్థితుల్లో లేరు… ఉదాహరణకు అదాని గ్రూప్ తీసుకున్న అప్పు 4.5 లక్షల కోట్ల రూపాయలు, నమ్మడం లేదు కదా కావాలంటే సుబ్రమణ్య స్వామి చేసిన ఈ ట్వీట్  చదవండి.

ఇప్పుడు Lockdown పెడితే మన దేశ ప్రజలకు సంవత్సరం పాటు భోజనం పెట్టగలిగే సామర్ధ్యం మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కి ఉంది… అయినా మోడీ ఎందుకు Lockdown పెట్టట్లేదు, కేవలం కార్పొరేట్ సంస్థలు బడా బాబుల వ్యాపారాలు దెబ్బ తింటాయనీ, అవి దెబ్బతింటే వాళ్ళు చేసిన ఆర్ధిక మోసాలు బయట పడతాయి. అవి ఏంటి అంటే బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు, ఎగ్గొడుతున్న వడ్డీలు బయటకు రాకుడదని, కార్పొరేట్ చేతిలో కీలు బొమ్మ అయిన మోడీని వారు శాసిస్తున్నారు.2014 వరకు మన్మోహన్ సింగ్ సోనియాగాంధీ చేతుల్లో ROBOT, కానీ ఇప్పుడు మోడీ అంబానీ మరియు అదానీ చేతులలో కీలు బొమ్మ!

ఈ సెకండ్ వేవ్ తర్వాత దేశ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేనిది. సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగినట్లయితే మొదటి వేవ్ నుంచి తప్పించుకొని నిలిచిన మిగిలిన చిన్నా, చితకా కంపెనీలు address లేకుండా … దివాలా తీసే  పరిస్థితి ఉంది… ఈ కంపెనీలన్నీ మూత పడిన తర్వాత పేదవాడు, మధ్య తరగతి వాడు ఇంకా పేద వాడిగా అయిపోతాడు… ఇందులో ఇంకో నష్టం ఏంటి అంటే పేద, మధ్య తరగతి ప్రజలు బ్యాంక్ లో దాచుకున్న డబ్బు కూడా వాళ్ళు నష్టపోతారు ఎలా అంటే ఇప్పుడున్న  ప్రైవేట్ బ్యాంకులు, ఆ బ్యాంకులు కాస్త మన దగ్గర తీసుకున్న deposit డబ్బును ఎటువంటి హామీలు లేకుండా బడా కంపెనీలకు అప్పుగా ఇస్తాయి.

అవి తీర్చలేక చేతులు ఎత్తేస్తాయి, అన్ని బ్యాంకులు దివాలా తీస్తాయి చివరకు మళ్ళీ ప్రజలకే బొక్క ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకులు అవ్వడంతో నీ డిపాజిట్లకు ప్రభుత్వం హామీ ఇవ్వదు, కానీ ప్రజలను ముంచిన కార్పొరేట్ కంపెనీలు, బడా బాబులు చేసిన అప్పులను write off చేస్తుంది కావాలంటే ఇప్పటి వరకూ ఎంత write off చేసిందో Google లో చూసుకోండి…

బ్యాంకులు దివాలా తీసినప్పుడు…  అప్పుడు ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలు చేసిన మోసం  తెలుస్తుంది.  కానీ అప్పటికే మన  ప్రభుత్వం చేతులు కాలిపోయి ఉంటుంది… అప్పుడు కూడా దేశ ఆర్ధిక పరిస్థితిని నిలబెట్టాలన్నా, నడిపించాలన్నా ప్రభుత్వానికి ఉన్న ఏకైక మార్గం ఏంటో తెలుసా…… ఇప్పుడు కార్పొరేట్ పిచ్చిలో పడిపోయి అమ్మేద్దాం అనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థలు.
ఒక్కసారి గా కార్పొరేట్ కంపెనీల దివాలా తీస్తున్న సమయంలో చాలామంది ఉద్యోగులు రోడ్ మీద పడతారు, వారితో పాటు విద్యార్థులు, నిరుద్యోగుల సంఖ్య ఒక్క సారిగా పెరిగి పోతుంది… అప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించ గలిగేవి ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే…. ప్రైవేట్ సంస్థలు అయితే ఖచ్చితంగా దివాలా తీస్తాయి…

విద్యార్థులు.. గుర్తు పెట్టుకోండి ప్రైవేట్ సంస్థలు దివాలా తీయవు అనే నమ్మకం ఉంటే సంతోషంగా చదువుకోండి, లేదు మీకు మనసులో ప్రైవేట్ కంపెనీల పైన అనుమానం ఉంటే Independence ఉద్యమానికి కూడా సిద్ధ మవ్వండి. దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ఉన్న అవగాహనతో ముందుగా హెచ్చరిస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిల్లిగవ్వ కూడా లేదు. మోడీ మాస్క్ కొనాలన్నా అప్పు చేసే కొనాలి, గడ్డం మాత్రం పెంచుతున్నారు…

ప్రైవేట్ కంపెనీలు దివాలా తీయగానే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు తగ్గిపోతాయి ఉద్యోగాలు లేక, కొనుగోలు సామర్ధ్యం లేక Indirect Tax GST ద్వారా వచ్చే ఆదాయం ఇంక రాదు… ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ఉంటుంది, అప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి మూడు లక్షల కోట్ల డివిడెండ్, మూడు లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను, income tax లు కట్టే PSU లే దిక్కు…

అదాని, అంబానీ లు బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పు ఇంకా కట్టలేదు, కట్టలేరు కూడా వాళ్ల ఆర్ధిక నిపుణుల ద్వారా ఈ విషయం  తెలుసుకున్నారు కాబట్టే, ఇప్పుడున్న ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి వెలకట్టలేని ప్రజల ఆస్తులు అయినటువంటి ప్రభుత్వరంగ సంస్థలను, వాటికి నష్టాలు వచ్చినవనే సాకు చూపి చౌకధరకు కొన్ని సొంతం చేసుకున్నారు, ఇంకొన్నిటిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు… భవిష్యత్తులో వాళ్ల కంపెనీలు దివాలా తీసినప్పుడు ఇప్పుడు కొంటున్న ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్ముకుంటారు. అది వాళ్ల దుర్మార్గపు కుట్ర ఈ విషయం మోడీకి తెలుసు కానీ వాళ్లను ఏమి చేయలేరు   ఎందుకంటే మోడీ వాళ్ల చేతిలో కీలు బొమ్మ!

కార్పొరేట్ సంస్థల నుంచి మన ఆర్ధికవ్యవస్థను, మన దేశాన్ని కాపాడుకోవాలి అంటే ఉన్న PSU లను ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ప్రజలు పోరాడాలి, ముఖ్యంగా విద్యార్థులు… ఎందుకంటే తర్వాత భవిష్యత్ మనది. ఇప్పుడున్న ప్రభుత్వ రంగ సంస్థలు మోడీ పెట్టినవి కాదు నచ్చినట్టు అమ్ముకోవడానికి.

ఇది మన ప్రజల హక్కు, మన ఆస్థి…..
మోడీ కి సిగ్గు, బుద్ధి లేదు కాబట్టి PSU లను అమ్మేస్తానని అంటున్నాడు కానీ మనకు బుద్ధి, సిగ్గు రెండు ఉన్నాయి కదా వాడు ఎవడో అమ్మేస్తాను అంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటాం ఎలా అయినా వీటిని కాపాడుకోవాలి.

మన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకుందాం, ఇప్పుడు పోరాడక పోతే, విద్యార్థులు ఉద్యోగం అనే పదాన్ని మర్చిపోయి, బలవన్మరణాలు పెరుగుతాయి. అంతే కాకుండా ప్రభుత్వం ఏ పథకాలు పెడుతుందా అని ఎదురు చూడాలి. ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది మీరు ఏం చేస్తారో మీ ఇష్టం…

.- సి హెచ్ చంద్రశేఖర్
(సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి)