కొమరంభీమ్ గా ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది..

438

రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై భారీ అంచనాలున్నాయని తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా కనిపిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే రెండు టీజర్లు వచ్చాయి. సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరంభీమ్ గా ఎన్టీఆర్ కనిపించారు. ఈ రెండు టీజర్లు సినిమాపై అంచనాలని ఇంకా పెంచాయి. అదీగాక తాజగా యాక్షన్ సన్నివేశాల విషయమై ఎన్టీఆర్ చెప్పిన మాటలు అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచాయి. ఐతే ఈ సినిమా నుండి తాజగా మరో పోస్టర్ రిలీజైంది.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉగ్రరూపంలో ఉన్న కొమరం భీమ్ పోస్టర్ ని విడుదల చేసారు. చేతిల్లో ఈటె పట్టుకుని శత్రువులకి మీదకి పరుగెడుతున్నవాడిలా ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. నడుముకి ఎర్ర కండువా కట్టుకుని కళ్ళలో రౌద్రాన్ని నింపుకున్న ఎన్టీఆర్ కు ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చింది.