అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం అయ్యేనా?

338

2021-22 బడ్జెట్ లో 11వ. P.R..C. ప్రతిఫలించేనా?
డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి

గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టే 2021-22 వార్షిక బడ్జెట్ లో ఉద్యోగులకు సంబంధించి 11వ. P.R.C. వివరాలు పొందుపరచాలని, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి సూచించారు. C.P.S. రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తం, సకాలంలో P.R.C. అమలు చేస్తాం అని వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది.  అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కనీసం 2021-22 బడ్జెట్ లో నైనా వీటికి పరిష్కారం చూపాలి. అగ్రిగోల్డ్ బాధితులకు Rs.1150 కోట్లు కేటాయించి 13 లక్షల మందికి వెంటనే మేలు చేస్తాం. మిగిలిన వారికి త్వరితగతిన పరిష్కారం చూపిస్తాం అని వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. 2019-20 బడ్జెట్ లో Rs.1150 కోట్లు కేటాయించి Rs.264 కోట్లు మాత్రమే విడుదల చేసింది.  2020-21 లో Rs.200 కోట్లు కేటాయించి ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు…కనీసం 2021-22 బడ్జెట్ లోనైనా అగ్రిగోల్డ్ బాధితులకు Rs.4 వేల కోట్లు కేటాయించి, విడుదల చేసి వీరి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తులసిరెడ్డి డిమాండ్ చేశారు..