ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ!

259

కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ఆయుష్మాన్ భారత్(ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన)లో చేరనున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జాతీయ ఆరోగ్య శాఖతో ఓ ఎంవోయూ(ఒప్పందం) కుదుర్చుకున్నది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సీఎంవో ఈ విషయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే వైద్యాధికారులు ఈ ఎంవోయూ కుదుర్చుకున్నట్లు సీఎంవో వెల్లడించింది. అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కోసం అవసరమైన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖరారు చేసింది. దీనిపై సీఎం స్పందించారు. నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ సెక్రటరీ శ్రీ ఎస్ఏఎం రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓకు సీఎం ఉత్తర్వులు జారీ చేశారు.