అమ్మిరెడ్డిపై మండిపడ్డ లోకేష్

405

అమ్మిరెడ్డి సిగ్గులేదా?: లోకేష్‌

గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిపై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. ‘‘ఎస్పీ అమ్మిరెడ్డి గారూ.. ప్రజ‌ల సొమ్ము జీతంగా తీసుకుని, తాడేప‌ల్లి కొంప‌కి చాకిరీ చేయ‌డానికి సిగ్గులేదా?. సోష‌ల్‌ మీడియాలో వీడియో పెట్టిన‌ వాళ్లని.. అంత‌ర్జాతీయ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన‌ట్టు ఏంటా ఓవ‌రాక్షన్‌?. ఇవే వీడియోలు టీడీపీపై పెట్టిన వారిపై మేం పెట్టిన కేసుల్లో ఇప్పటి వ‌ర‌కూ ఎన్నింట్లో అరెస్ట్‌లు చేశారు?. మంత్రి సీదిరి అప్పల‌రాజుపై కేసు పెట్టడానికి వ‌చ్చిన‌ వారిపైనే రివ‌ర్స్ కేసు బ‌నాయించారు. జ‌గ‌న్‌రెడ్డి ద‌గ్గర ప‌నిచేయాల‌ని అంత ఉత్సాహం, కుల‌పిచ్చి ఉంటే.. ప‌విత్రమైన ఆ ఖాకీ డ్రెస్ తీసేసి బులుగు కండువా కప్పుకోండి’’ అంటూ ట్వీట్టర్‌లో లోకేష్‌ ధ్వజమెత్తారు.