బాబు హయాంలో లెక్కలేనన్ని రాజద్రోహం కేసులు

473

– రఘురామకృష్ణంరాజుపై సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసింది.
– రఘురామ కేసు దర్యాప్తులో తన కుట్ర ఎక్కడ బయటపడుతుందనే భయంతోనే చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు.
– జగన్ ఏదైనా ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటారు.. కక్ష సాధింపులకు పాల్పడరు
– రాజద్రోహం అనే కేసు ఉందా అని బాబు మాట్లాడటం విడ్డూరం
– ఓటుకు కోట్లు కేసు నేపథ్యంలో.. కేసిఆర్ మీద చంద్రబాబు ఏకంగా 12 దేశద్రోహం కేసులు పెట్టారు
– గుంటూరులో న్యాయవాదుల మీద రాజద్రోహం(124 ఏ) కేసులు పెట్టారు
– గుంటూరులో టీడీపీ నారా హమారా సభలో ముస్లిం యువత మీద అక్రమ కేసులు పెట్టారు.
– మెడికల్ బోర్డు వేసింది హైకోర్టు.. రిపోర్టు ఇచ్చింది హైకోర్టు, ఇందులో ప్రభుత్వానికి ఏం సంబంధం..?
– చంద్రబాబు కుట్రలో భాగంగానే రఘురామకృష్ణరాజు దూషణలకు ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది
– ఎర్రచందనం కేసులో కూలీలను కాల్చి చంపడం అరాచకం,ఆటవికం,పౌరహక్కులకు భంగం కాదా..?
– రాజమండ్రి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో 30 మందిని పొట్టనబెట్టుకోవడాన్ని అరాచక పాలన అంటారు.
– కోవిడ్ నేపథ్యంలోనే అసెంబ్లీ జరపలేకపోతున్నాం.. టీడీపీ బహిష్కరించడం అంటే చట్టసభలను అగౌరవపర్చడమే
  – వైయస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి   

– గత మూడు నాలుగు రోజులుగా లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు అరెస్ట్, తదనంతర పరిణామాలు, వీటన్నింటిని ఒకపక్క గమనిస్తుండగా ఈ రోజు ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా పౌరహక్కుల నేతలు, ప్రతిపక్ష నాయకులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పౌర హక్కుల మీద ఉద్యమించాల్సిన ఆవశ్యకత, వాటికి భంగం కలుగుతున్న తీరుపై ఆవేదన చెందారని, ఘోరాలు జరుగుతున్నాయని మాట్లాడిన తర్వాత వాటిపై స్పందించాల్సిన అవసరం వచ్చింది.

-ఈ నాలుగైదు రోజులుగా జరుగుతున్నది, ముందు జరిగింది ప్రజలందరికీ తెలుసు. క్లుప్తంగా చెప్పాలంటే రఘురామకృష్ణంరాజు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరపున లోక్‌సభకు ఎన్నికై ఆ తర్వాత డీవియేట్‌ అవుతూ పోవడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ భావించడం వల్ల ఆయన్ను డిస్‌క్వాలిఫై చేయమని దాదాపు 10 నెలల కిందట లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడం జరిగింది.

– ఆ తర్వాత ఆయన వరస పెట్టి పార్టీ మీద, పార్టీ అధ్యక్షుడి మీద, ముఖ్యమంత్రి  మీద వ్యక్తిగత దూషణలు చేయడం, ముందు విమర్శలతో మొదలుపెట్టి వ్యంగ్యంగా మాట్లాడడం, రకరకాలుగా వ్యవహరించడం…ఏ శక్తులైతే  వైఎస్‌ జగన్‌ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో, వారంతా రాజకీయంగానే కాదు రాజకీయాలకు అతీతంగా కూడా ఆయన్ను ప్రోత్సహించడం అందరూ గమనిస్తున్నారు. ఇది ఓవర్‌ నైట్‌ జరిగింది కాదు, ఏడాది నుంచి జరుగుతున్నది, పార్టీ అతన్ని డిస్‌క్వాలిఫై చేయమని ఆధారాలు చూపిన తర్వాత కూడా లోక్ సభ స్పీకర్‌ చేయకపోవడంతో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఎంటర్‌టైన్‌ చేయడంతో ఈయన మరింత విజృంభించి మాట్లాడుతున్న విషయం అందరూ గమనించారు.

కక్ష సాధింపులకు జగన్ ఎప్పుడూ పోరు.. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటారు
– ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి అడ్డదారుల్లో పోవల్సిన అగత్యం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి లేదు,  జగన్‌ కి అసలుండదు. ఎందుకంటే ఇలాంటివి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఎదుర్కుంటునే ఉన్నారు, ఏ రోజు ప్రజలను నమ్ముకోవడం తప్ప ఇంకో పద్ధతుల్లో ఆయనెప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఏది ఉన్నా ప్రజల్లోకి వెళుతున్నారు, కష్టసుఖాలు అక్కడే చెబుతున్నారు, ప్రజలు ఆయన్ను ఆదరిస్తున్నారు, ఆ క్రమంలోనే పార్టీ బలపడింది, అలానే అధికారంలోకి వచ్చింది. ఈ రోజుకూ ఆయన భాద్యత మరిచిపోలేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ప్రజలు మరింత భాద్యత ఇచ్చారే తప్ప, ఈ అధికారం ఒక కిరీటం అని, పవర్ అని, దీంతో ఏమైనా చేయచ్చు అనే ఆలోచన ఆయనకు లేదన్న విషయం కూడా ప్రజలకు తెలుసు.

– గత రెండేళ్ళ పాలనలో ప్రజలకు రావాల్సినవి కానీ, వారికున్న హక్కులుగానీ రాజకీయ నాయకులు విచక్షణ మీద ఆధారపడకూడదు, హక్కు ఉన్న ప్రతీ ఒక్కరికి శాచురేషన్‌ విధానంలో, అంటే సంతృప్త స్ధాయిలో అన్నీ అందాలని జగన్‌  అమలుచేస్తున్న తీరే నిదర్శనం. పాలకులు ఎవరైనా అధికారం కేంద్రీకృతం చేసుకోవాలనుకుంటారు కానీ ప్రజలు ఎవరు మీద ఆధారపడకూడదనే గొప్ప ఆలోచన గల నాయకుడు  జగన్‌.

– ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాష్ట్రంలో ఒకరకమైన అస్ధిరత సృష్టించేందుకు, సజావుగా అత్యధిక మెజార్టీతో ఎన్నికై ప్రజల విశ్వాసంతో వరుసగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లో విజయాలతో స్థిరమైన పాలన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోలేక ప్రజల్లో నిలబడి, ప్రజలకు నచ్చజెప్పి ఇంతకంటే మెరుగైన పాలన చేస్తామని చెప్పుకోలేని టీడీపీ, చంద్రబాబు అడ్డదారుల్లో ఈ ప్రభుత్వాన్ని ఎలా అస్ధిరపరచాలి, వివిధ వర్గాల మధ్య ఎలా స్పర్ధలు  సృష్టించాలి వాటి నుంచి ఎలా రాజకీయంగా లాభం పొందాలి అని చేస్తున్న క్రమంలో భాగంగానే రఘరామకృష్ణంరాజు అనే క్యారెక్టర్‌ను ముందుకు తోశారు, ఇది కూడా ప్రజలకు తెలుసు.

– గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే అది పరాకాష్టకు చేరుకుందో, దానిపై వివిధ వర్గాలు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. సీఎం ఆయన కుటుంబం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడినవి ఎన్నో సందర్భాలు ఉన్నాయి కానీ ఆయన ఏ రోజూ వాటిని పట్టించుకోలేదు, ఆయన పాపానికి ఆయనే పోతాడని, దేవుడే చూసుకుంటాడంటుంటారు, అందుకే మా పార్టీకి కోట్ల మంది అభిమానులు, లక్షల మంది కార్యకర్తలు ఉన్నా ఎక్కడా రెచ్చిపోకుండా ఉన్నారంటే కారణం మా నాయకుడు అలాంటి వారు కాబట్టి, ఆయన నిగ్రహం, సంయమనం పాటిస్తారు కాబట్టి, పార్టీ కూడా అలాంటిది కాబట్టి. ఈ స్ధితిలో వస్తున్న ఫిర్యాదులపై సీఐడీ సుమోటోగా కేసు రిజిస్టర్‌ చేయడం వల్లే రఘురామకృష్ణరాజు అరెస్టు జరిగింది.

– చట్టంలో ఉన్న సెక్షన్లు, వాటిని ఉపయోగించే అధికార యంత్రాంగం, వారి బాధ్యతా నిర్వహణ మేరకు ఎంతవరకు ఉపయోగించవచ్చే ఉపయోగిస్తారు. వారు పరిధి దాటితే.. దుర్వినియోగం అయితే చూడడానికి కోర్టులు కూడా ఉన్నాయి, అందుకే ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్ళింది. దీనిపై ఎవరూ గొడవ చేయాల్సిన అవసరం లేదు, యాగీ చేయాల్సిన అవసరం లేదు. కొంపలంటుకుపోయినట్లు గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు, టీడీపీ వారికి అసలు హక్కు లేదు, మిగిలిన వారు ఎవరైనా ఉంటే ప్రజాస్వామ్యవాదులు, పౌరహక్కుల వారు, వారికి కచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే.

రఘురామకృష్ణరాజు అరెస్టులో ప్రభుత్వ పాత్ర పూచికపుల్లంత కూడా లేదు
– ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అయినా దాని భాద్యతలు నిర్వర్తించడానికి అవసరమైన అధికారాలు వినియోగించడానికి ప్రొటెక్షన్‌ ఉంటుంది, అలాగే దుర్వినియోగం అయితే చెక్‌ చేయడానికి కోర్టులు ఉంటాయి, ఇది నార్మల్‌గా జరిగేదే, కానీ ఈ ఘటన చూస్తే ఎక్కడ డీవియేషన్‌ ఉంది, ఎవరు దీనిని అతిగా వాడుకున్నారు, ఇందులో ప్రభుత్వం రోల్‌ ఎక్కడ ఉంది, ఎక్కడా పూచికపుల్లంత కూడా లేదు, డిపార్ట్‌మెంట్‌ మూవ్‌ అయింది, ఆయనను సీఐడీ పోలీసులు తీసుకొచ్చింది, అరెస్ట్‌ చేసిన తర్వాత కోర్టు ముందుంచారు, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు, ఇదంతా వరసగా జరుగుతున్న దాంట్లో ఆయన పాదాలకు గాయాలు అయ్యాయి అన్న ఎపిసోడ్‌ కూడా చూద్దాం.

మెడికల్ బోర్డు రిపోర్టుతో ప్రభుత్వానికేం సంబంధం ఉంటుంది
– హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మెడికల్‌ బోర్డు ఏర్పాటుచేసి అందులో క్వాలిఫైడ్‌ డాక్టర్లు రిపోర్ట్‌ ఇవ్వడమే కాక వీడియోగ్రాఫ్‌ చేసి, మొత్తం సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు రిపోర్ట్‌ ఇచ్చారు, ఇందులో ప్రభుత్వానికి ఏం సంబంధం, దానిపై చేస్తున్న రాద్దాంతం చూస్తే అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని భాద కలుగుతుంది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు విషయం పక్కదోవ పడుతుంది. రఘురామకృష్ణంరాజు అనే వ్యక్తి ఏ పార్టీ తరపున గెలిచారో ఆ పార్టీ నచ్చకపోతే నిరంభ్యంతరంగా రాజీనామా చేసి పోవచ్చు , ఆయన చేస్తారో లేదో ఆయన విచక్షణకే వదిలేద్దాం, కానీ చట్టం ఉంది రాజ్యాంగం ప్రకారం అలాంటి వారిని డిస్‌క్వాలిఫై చేయాలి కానీ చేయలేదు, ఇది ఒక తప్పు, రోజూ విమర్శలు చేస్తున్నా ఎవరూ ఏం అనలేదు కానీ కుట్రపూరిత వ్యవహారం చేసినప్పుడే సీఐడీ తనంతట తానే మూవ్‌ అయింది, కోర్టు పరిధిలో వ్యవహారం ఉంది కానీ నాలుగు రోజులు ఓపిక లేకుండా ఆరోపణలు చేశారు.

– ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగిఉంటే ముందు హైకోర్టులో వారి లాయర్‌ ఎందుకు ప్రెజెంట్‌ చేయలేదు, ఇది కావాలనే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా ప్రయత్నం జరుగుతుందన్న అనుమానాలు ఉన్నాయి. నిజంగా సీఐడీ కానీ మరెవరైనా చేసి ఉంటే అంతా ఓపెన్‌గా ఉంది, వారి లాయర్స్‌ కూడా కలిశారు, అంతా వీడియోల్లో కనిపిస్తుంది, హైకోర్టులో కేసు అయిన తర్వాతే ఇది మొదలైంది, మళ్ళీ ఏకంగా ఇప్పుడు సుప్రీందాకా వెళ్ళింది, ఎక్కడా ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయడం కానీ ఇంటర్‌వీన్‌ కావడం కానీ జరగలేదు కాబట్టే మీరు ఇంత యాగీ చేస్తున్నారు, లేదు కాబట్టే ఇంత చర్చ జరుగుతోంది, ఆరోజు కూడా రఘురామకృష్ణరాజు కారులో వెళుతూ మీసం మెలేస్తూ, అరికాలు చూపించారు, మరోవైపేమో దిగి నడవలేక భుజం మీద చేయి వేసి నడిచారు.

పౌరహక్కులకు ఎక్కడా భంగం కలగలేదు.. పచ్చ పసిరికల్లాంటి మీడియా తెగే ఆ పనిచేస్తుంది
– పౌరహక్కులకు ఎక్కడైనా భంగం కలిగిందా, ప్రభుత్వం ఎక్కడైనా కుట్రపూరితంగా వ్యవహరించిందా, ఎక్కడా లేదే, కానీ ప్రజలను మభ్యపెట్టాలని, పక్కదోవ పట్టించాలని దుర్మార్గపు అలవాటు ఉన్న పచ్చ పసిరికల్లాంటి మీడియా అదే పని చేస్తుంది, ఆ తెగ అదే పనిచేస్తుంది, బేస్‌ లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఏమైనా వారి పార్టీ ఎంపీనా..?

– పౌరహక్కులంటే సాయిబాబా, వరవరరావు లాంటి వారి మీద జరుగుతున్న వాటిపై పోరాడాలి కానీ, ఇవేవీ కాకుండా చిత్రమైన పరిస్ధితి ఏంటంటే ప్రభుత్వంలో జరుగుతున్న వాటిపై చర్చ జరగాలి లేదా 124 ఏ ఉండాలా వద్దా అనే దానిపై చర్చ జరగచ్చు. కానీ జగన్‌   ఎప్పుడూ అధికారాన్ని పవర్‌ అనుకోరు, ప్రజలకు సేవ చేసే అవకాశం, భాద్యత అనుకుంటారు కానీ ఈ విషయంలో ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి మీద బురదచల్లే కార్యక్రమం దుర్మార్గం, టీడీపీకి ముందు నుంచి అలవాటే కానీ వారి వలలో మేధావులు పడతారని ఆలోచనలోనే ఇంత వివరణ ఇస్తున్నాం.

దేశద్రోహం అనే మాట వినలేదని చంద్రబాబు అనటం విడ్డూరం
– చంద్రబాబు దేశద్రోహం అనే మాట ఎప్పుడూ వినలేదన్నారు, ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే కేసీఆర్‌  మీద 12 కేసులు పెట్టారు, ఓటుకు కోట్లు కేసులో 12 చోట్ల ఫిర్యాదులు చేయించి 124 ఏ పెట్టి దేశద్రోహం కేసు పెట్టారు, అలాగే గుంటూరులో అడ్వకేట్ల మీద పెట్టారు, అలాగే  జగన్  సభలో పాల్గొన్నందుకు అప్పట్లో మా ఎమ్మెల్యేగా ఉన్న గిడ్డి ఈశ్వరి మీద రాజద్రోహంతోపాటు మూడు కేసులు పెట్టారు, ఆ తర్వాత ఆమె టీడీపీలో చేరారు, కేసీఆర్‌  మీద పెట్టిన కేసులు మొత్తం 124 ఏ కింద ప్రభుత్వాన్ని అస్ధిర పరచాలని ప్రయత్నిస్తున్నారని, అలాగే హోంమంత్రి చినరాజప్ప దిష్టిబొమ్మను బీజేపీ వారు తగలబెట్టారని పెట్టారు, గుంటూరులో టీడీపీ నారా-హమారా సభలో ముస్లిం యూత్‌ మీద 120 బి అక్రమ కేసులు పెడితే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేశారు. చంద్రబాబు గారూ.. మీరు చేసింది ఎత్తి చూపుతున్నాం కానీ జగన్‌  పొరపాటున కూడా ఇలా చేయరు, జగన్  ఏదైనా ప్రజాక్షేత్రం ద్వారానే సాధించాలే కానీ ఇలా చేయకూడదనుకుంటారు. వ్యక్తిగత విద్వేషాలు ఎప్పుడూ ఫాలో కారు, కానీ మీకు సంబంధం లేని వ్యవహారంలో మీరు ఎలా సిగ్గులేకుండా ఎలా మాట్లాడతారు.

– ముఖ్యమంత్రి ని, ప్రభుత్వ పథకాల గురించి రఘురామకృష్ణరాజు అసహ్యంగా మాట్లాడారు, దాని వెనుక ఒక కుట్ర కోణం ఉంది, ఏది అనేది త్వరలోనే తెలుస్తుంది. మీడియాలో 10 సెకన్‌లకు ఇంత అని కమర్షియల్‌ రేట్‌ ఉంటుంది కదా కానీ, ఆయన్ను పొద్దున లేచినప్పటి నుంచి రచ్చబండ కార్యక్రమం లైవ్‌ వినండి అని రోజూ చెప్పలేదా, దాని ముందు దీనిని ఎలా ప్రచారం చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా అస్ధిర పరచాలని సమావేశాలు జరగలేదా, కుట్రపూరిత సమావేశాలు మీ మధ్య జరగలేదా, ఇవన్నీ లేకుండానే ఈ సమన్వయం లేకుండానే రఘురామకృష్ణరాజుకు మీ ప్లాట్‌ఫామ్‌ ఎలా వచ్చింది, ఆయన లోకేష్, చంద్రబాబు, సుజనాచౌదరితో మాట్లాడడం ఇవన్నీ జరిగిన తర్వాతనే కదా ఆయన టీవీ స్క్రీన్‌ల మీదకు వచ్చారు.

– రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ద్వారా మీ కుట్ర ఏదైతే ఉందో అది పూర్తిచేయాలని ఇంత కాలం నడుపుతూ వచ్చిన వ్యవహారం ఇప్పుడు బ్రేక్‌ పడింది. ఇది ఊరికే ఒక వ్యక్తి చేసింది కాదు, దర్యాప్తులో అన్నీ బయటికి వస్తాయి, మీ బండారం అంతా బయటపడుతుందనే భయంతో చంద్రబాబు ఇదంతా చేస్తున్నారు. రోజూ ప్రభుత్వంపై బురదచల్లుతున్నా ఏం పట్టించుకోలేదు, అన్యాయంగా అనిపిస్తే పరువునష్టం వేస్తాం లేనిపక్షంలో చూసి చూడనట్లు వదిలేస్తాం కానీ ఇప్పుడు కూడా మీ మీద దేశద్రోహం ఎవరు పెట్టారు, మీరు ఈ కుట్రలో భాగస్వామ్యులు అనే అనుమానంతో ఏ2, ఏ3 కింద పెట్టారు, అప్పుడే భుజాలు తడుముకోవడం ఏంటి, ఇంకా కేసు పెట్టలేదు, కుట్ర రుజువైతే ఆ కేసులు రావచ్చు, అది ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ చూసుకుంటుంది, అది కోర్టులో నిలబడుతుందా లేదా అనేది వారికేం సంబంధం.

– ప్రభుత్వానికి ఎక్కడా ప్రమేయం లేదు కానీ చంద్రబాబు వీటన్నింటికి తాను అతీతుడైనట్లు అమాయకంగా మాట్లాడుతున్నారు. ఆయన జేసీబీ, ఏసీబీ, పీసీబీ ద్వారా కూడా పరిశ్రమలను మూస్తున్నారన్నారు, కానీ ఆయన హయాంలో 52 పెద్ద పరిశ్రమలు, మూడు నాలుగు వేల కోట్ల పెట్టుబడులు ఉండేవి, వాటన్నింటినీ మూసేశారు. ఎవరైనా కక్షపూరితంగా వ్యవహరించే ఉద్దేశం ఉంటే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక్క కేసు పెట్టారా, రాగానే పెట్టేవాళ్ళం కదా, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దూళిపాళ్ళ నరేంద్ర వీరంతా అరెస్ట్‌ అయ్యారే ఎక్కడైనా వారు మమ్మల్ని హింసించారు అనలేదే, వారు కోరుకున్న హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు, న్యాయస్ధానాలకు వెళుతున్నారు. కక్షసాధింపు ఒక్కటి చూపండి.

– చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇప్పుడు. అదే మీ హాయంలో జరగనిది ఏదైనా ఉందంటే చెప్పండి.  ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడిస్తే సీఎంగా చంద్రబాబు పంచాయితీ చేశాడు, ఎర్రచందనం కేసులో తమిళ కూలీలను కాల్చిచంపారు, పౌరహక్కులకు భంగం అంటే అది, ప్రభుత్వ అరాచకం అంటే అది, నియంతృత్వం అంటే అది, తన పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల సందర్భంగా 30 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నాడు,  ఆ కేసును పూర్తిగా మాఫీ చేయడం అది అధికార దుర్వినియోగం, పైగా నిరంకుశంగా, రాక్షసంగా ఇలాంటివి ఎక్కడ జరగలేదు ఇలాంటి ఘటనలు చాలై ఉన్నాయ్ అని మితిమీరి మాట్లాడటం అరాచకం, అక్రమం, పౌర హక్కులకు భంగం కలిగించడం., అది చంద్రబాబు తీరు.

– దెయ్యాలు వేదాలు వల్లించడం అనే పాత సామెతలా,  పౌరహక్కుల ఉల్లంఘన అంటూ చర్చలు చేస్తున్న చంద్రబాబు తాను  చేసిన దారుణాలకు తల ఎక్కడ పెట్టుకుంటారు. మిగిలిన వారికి కూడా చెప్తున్నాం, లెఫ్ట్‌ వారికి కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, అక్కడా ఇదే రాజ్యాంగం ఉంది, ఇదే చట్టం ఉంది, అక్కడా కేసులు పెడుతుంటారు, కానీ ఫైనల్‌గా తప్పు జరిగిన సమయంలో వారినే సపోర్ట్‌ చేయడం ఉండకూడదు, అధికార దుర్వినియోగం జరిగితే న్యాయస్ధానాలు ఉన్నాయి, వాటి ముందుకు తీసుకెళ్ళాలి, అలాంటి చట్టాలు అవసరమా లేదా అని చర్చించవచ్చు కానీ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళుతున్నప్పుడు నిజాయితీగా ముందుకెళుతున్నప్పుడు వాటికి రాజకీయ దురుద్దేశాలు అంటగట్టే ప్రయత్నంలో మీరెవరూ గురికావద్దని రిక్వెస్ట్‌ చేస్తున్నాం.

– ఈ కేసుకు సంబంధించి లాజికల్‌ ఎండ్‌ ఏమైనా ఉండచ్చు కానీ మా ముఖ్యమంత్రి  ప్రజల గురించే ప్రజలకు ఏమైనా చేయాలనే తపనతో ఉన్నారు తప్ప అందులో ఎక్కడా డీవియేషన్‌ ఉండదు కానీ దానిని అవకాశంగా తీసుకుని కుట్రలకు పాల్పడితే దానికి సంబంధించిన వ్యవస్ధ చేయాల్సిన పని చేస్తుంది, అంతేకానీ ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..

చట్టసభలపై టీడీపీకి గౌరవం లేదు
– అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవ్వాలని టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం అందింది, తప్పనిసరి పరిస్ధితుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్ధితి ఇది. మేం చేసింది చెప్పుకోవడానికి 24 గంటలు చాలవు, ఎన్ని రోజులైనా సమావేశాలు నిర్వహించడానికి మేం సిద్ధం, కానీ పరిస్ధితులు అందుకనుగుణంగా లేవు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ చేసే ప్రసంగం, బడ్జెట్‌ ఉంటాయి కాబట్టి ప్రతిపక్షం కూడా ఉంటే బావుంటుంది, కాదని రాకపోతే చేసేదేం లేదు. టీడీపీ విధానం చట్టసభల మీద వారికి ఉన్న గౌరవం ఏపాటిదో తెలియజేస్తుంది.